ముకేశ్ అంబానీ... రిలయన్స్ గ్రూప్ అధిపతి. భారత్‌లో అత్యంత సంపన్నుడు. దేశంలో దాదాపు అందరికీ సుపరిచితులు. ప్రతి ఒక్కరూ ఆయన వ్యాపార సంస్థల సేవల్ని ఏదో ఒక రూపంలో పొందుతున్నవారే.
డబ్బు సంపాదించడం గురించి కాస్త గొప్పగా చెప్పాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చినా.. అంబానీ పేరు వాడతారు. 'నేనే అంబానీ' టైటిల్‌తో సినిమా కూడా వచ్చింది. సంపాదనకు అలా పర్యాయపదంగా మారారు అంబానీ.
డబ్బుకు పర్యాయపదం మాత్రమే కాదు.. ఏకంగా అర్థమే అంబానీ అంటోంది గూగుల్. అదెలాగో తెలుసుకోవాలంటే గూగుల్ ట్రాన్స్‌లేట్‌కు వెళ్లండి. 'అంబానీ' పదాన్ని రొమేనియా నుంచి ఆంగ్లంలోకి అనువదించండి. అప్పుడు ఆ పదానికి అర్థం... 'నా వద్ద డబ్బు ఉంది (ఐ హ్యావ్ మనీ)' అని వస్తుంది.
చూశారా... అంబానీ అంటే డబ్బేనని నిరూపితమైంది!
ఇదీ చూడండి: పాపాల పాకిస్థాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ 'బ్లాక్‌లిస్ట్' ముప్పు!