ETV Bharat / business

అమెజాన్​కు ఊరట- అంబానీ, బియానీ ఒప్పందంపై స్టే

రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై సింగపూర్​కు చెందిన ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్టే విధించింది. ఒప్పందాన్ని సవాల్ చేస్తూ అమెజాన్ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్​కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.

Amazon Wins Order to Stall $3.4 Billion Reliance-Future Deal
అమెజాన్​కు ఊరట- రిలయన్స్, ఫ్యూచర్ ఒప్పందంపై స్టే
author img

By

Published : Oct 26, 2020, 5:33 AM IST

ఫ్యూచర్ గ్రూప్‌ తన రిటైల్‌ వ్యాపారాన్ని 24,713 కోట్లకు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు విక్రయించే ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌లో అమెజాన్‌కు ఊరట లభించింది. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్‌ ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఏకసభ్య జడ్జి ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ స్టే విధించింది.

ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఒక అన్‌లిస్టెడ్‌ సంస్థలో 49 శాతం వాటాకొనుగోలు చేసేందుకు అమెజాన్ గతేడాది అంగీకరించింది. తద్వారా ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ను మూడేళ్ల నుంచి పదేళ్లలోపు కొనుగోలుచేసేందుకు తమకు న్యాయబద్దమైన హక్కు ఉందని అమెజాన్‌ చెబుతోంది.

ఐతే.. కిషోర్ బియానీ తన ఫ్యూచర్‌ గ్రూప్‌లోని చిల్లర, టోకు వ్యాపారం, లాజిస్టిక్స్, గిడ్డంగుల యూనిట్లను.. అంబానీకి చెందిన రిలయన్స్​కు అమ్మేందుకు సంతకం చేశారు. రిలయన్స్​తో ఫ్యూచర్ గ్రూప్‌ ఒప్పందాన్ని అమెజాన్‌ సంస్థ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌లో సవాల్ చేసింది. సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేషన్ ప్యానెల్‌... అమెజాన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్బిట్రేషన్ ప్యానెల్ తుది నిర్ణయం తీసుకునే వరకు.. రిలయన్స్- ఫ్యూచర్ రిటైల్‌ ఒప్పందంలో ముందుకు వెళ్లొద్దని ఆదేశించింది.

ఆర్బిట్రేషన్‌లో తమకు ఊరట లభించిందని అమెజాన్ చెబుతుంటే.. రిలయన్స్ రిటైల్‌ వ్యాపార విభాగం మాత్రం ఫ్యూచర్‌ గ్రూప్‌తో ఒప్పందాన్ని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసే హక్కు.. భారతీయ చట్టాల ప్రకారం తమకు ఉందని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.