ETV Bharat / business

రిలయన్స్​ డీల్​పై 'ఫ్యూచర్​'కు అమెజాన్​ నోటీసులు - amazon future group deal

రిలయన్స్​తో ఒప్పందం విషయంలో ఫ్యూచర్​ గ్రూప్​నకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ లీగల్​ నోటీసులు పంపింది. గతంలో తమతో జరిగిన ఒప్పందాన్ని ఫ్యూచర్​ గ్రూప్​ ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ సంస్థల షేర్లు నష్టపోయాయి.

reliance-future-amazon
రిలయన్స్
author img

By

Published : Oct 8, 2020, 7:44 PM IST

రిలయన్స్​- ఫ్యూచర్​ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం చిక్కుల్లో పడింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్​ను సవాలు చేస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​.. ఫ్యూచర్​ గ్రూప్​నకు లీగల్​ నోటీసులు పంపింది.

గతంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఫ్యూచర్​ గ్రూప్​ ఉల్లంఘించిందని అమెజాన్​ ఆరోపించింది. తమ ఒప్పంద హక్కులను పొందేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానంలో ఉన్న కారణంగా ఇతర వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది.

నోటీసులు అందిన విషయాన్ని ఫ్యూచర్​ గ్రూప్​నకు చెందిన సలహాదారు ఒకరు ధ్రువీకరించారు. ఈ సమస్యను మధ్యవర్తిత్వం లేదా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

పడిపోయిన షేర్లు..

అమెజాన్​ లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పడిపోయాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా దాదాపు 1 శాతం రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ​ఫ్యూచర్​ గ్రూప్​ షేర్లపైనా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫ్యూచర్​ గ్రూప్​లోని కొన్ని ప్రధాన కంపెనీల షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి.

వివాదం ఏంటి?

2019 ఆగస్టులో అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కూడా ఓ ఒప్పందం జరిగింది. ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాను అమెజాన్‌ కొనుగోలు చేసింది. తద్వారా ఫ్యూచర్‌ రిటైల్‌లో 7.3 శాతం వాటా అమెజాన్​కు దక్కింది. ఆ ఒప్పందంలో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో ప్రమోటర్‌ వాటాను మొత్తంగా కొనుగోలు చేసే ప్రథమ హక్కునూ అమెజాన్‌ దక్కించుకుంది. కానీ, రిలయన్స్​తో ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది.

అయితే, ఈ విషయంపై స్పందించేందుకు రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ నిరాకరించాయి.

రిలయన్స్-ఫ్యూచర్ డీల్​..

కిశోర్​ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, టోకు, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఈ ఆగస్టు చివర్లో రిలయన్స్​ అనుబంధ ఆర్‌ఆర్‌వీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్​కు ఇంకా చట్టపరమైన అనుమతులు రావాల్సి ఉంది.

ఇదీ చూడండి: రిలయన్స్‌ రిటైల్‌కు మరింత 'ఫ్యూచర్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.