ETV Bharat / business

ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌కు 5% వాటా! - ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌కు 5% వాటా!

భారతీ ఎయిర్​టెల్ సంస్థలో వాటాలు కొనుగోలు చేయాలని అమెజాన్ భావిస్తోంది. కనీసం రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చల్లో భాగంగా అమెజాన్.. రూ.15,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన చేసినట్లు సమాచారం.

airtel
ఎయిర్​టెల్
author img

By

Published : Jun 5, 2020, 5:46 AM IST

Updated : Jun 5, 2020, 6:16 AM IST

భారతీ ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలు చేయాలని అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.కామ్‌ భావిస్తోంది. కచ్చితంగా పెట్టుబడి ఎంత అనేది తెలియనప్పటికీ.. కనీసం 2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.15,000 కోట్లు) పెట్టుబడితో వాటా కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ మేరకు పెట్టుబడులు భారతీలోకి వస్తే.. అమెజాన్‌కు దాదాపు 5% వాటా దక్కవచ్చని తెలుస్తోంది. కాగా, భారతీ ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ల మధ్య చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని.. ఒప్పంద నిబంధనలు మారొచ్చు.. లేదా ఒప్పందమే జరగకపోవచ్చని సంప్రదింపుల గురించి సమాచారం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు వార్త ఏజెన్సీలు వెల్లడించాయి. 30 కోట్ల మంది వినియోగదార్లతో భారత్‌లోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్‌ ఉన్న సంగతి విదితమే.

ఆకర్షణీయ డిజిటల్‌ భారత్‌

ఇటీవలి పరిణామాలు గమనిస్తే, అమెరికా సాంకేతిక దిగ్గజాలకు భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆకర్షణ తెలుస్తుంది. ఎంతో విస్తృతి కలిగిన భారత మార్కెట్‌పై పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కన్నేశాయని చెబుతున్నారు. భారత్‌లో 57.4 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉండడమే ఇందుకు కారణం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో అంతర్జాతీయ దిగ్గజాలు వాటాలు కొంటున్న నేపథ్యంలో అమెజాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ చర్చలు చోటు చేసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌, కేకేఆర్‌, సిల్వర్‌లేక్‌ పార్టనర్స్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌ల నుంచి జియోలోకి 1000 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. గూగుల్‌ కూడా వొడాఫోన్‌ ఐడియాలో 5% వాటా కొనాలని భావిస్తున్నట్లు గత వారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కంపెనీల స్పందన ఇదీ

భారతీ ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ సంప్రదింపులపై 'జరిగే లేదా జరగడానికి అవకాశం లేని ఊహాగానాల విషయంలో కంపెనీ స్పందించలేదని' అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ ప్రతినిధిని సంప్రదించగా.. 'మేం సాధారణంగా అన్ని డిజిటల్‌, ఓటీటీ సంస్థలతో పనిచేస్తుంటాం. వారి ఉత్పత్తులు, కంటెంట్‌, సేవలను మా వినియోగదార్లకు ఇవ్వడం కోసం అనుబంధాన్ని కలిగి ఉంటాం. అంతకు మించి ఎటువంటి పరిణామాలూ లేవ'ని అన్నారు.

అమెజాన్‌.. గతంలోనూ..

ఇ-కామర్స్‌, ఆహార రిటైల్‌ వ్యాపారంపై పెట్టుబడులు పెట్టడంతో పాటు భారత్‌లోని పలు ఆఫ్‌లైన్‌ రిటైల్‌ చైన్లలోనూ అమెజాన్‌ వాటా కొనుగోలు చేసింది. 2017లో షాపర్స్‌ స్టాప్‌లో రూ.179.26 కోట్ల పెట్టుబడులు పెట్టి, 5 శాతం వాటా సొంతం చేసుకుంది. ఆదిత్య బిర్లా రిటైల్‌ కొనుగోలు చేసిన విట్‌జిగ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌లో సెప్టెంబరు 2018లో పెట్టుబడులు పెట్టింది. గతేడాది ఆగస్టులో ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రమోటర్ల నుంచి 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఫ్యూచర్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం వాటా ఉంది.

దూసుకెళ్లిన షేరు: అమెజాన్‌ పెట్టుబడి ప్రతిపాదనల అంచనాలతోనే గురువారం బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు రూ. 21.45 లాభపడి, రూ.573.15 వద్ద స్థిరపడింది.

Last Updated : Jun 5, 2020, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.