ETV Bharat / business

అమెజాన్‌ పే 'స్మార్ట్‌ స్టోర్స్‌'తో కొనుగోలు మరింత సులభం! - business news

ప్రముఖ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకు వేసింది. సంస్థకు చెందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' సదుపాయాన్ని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో కొనుగోలును సౌకర్యంగా, సురక్షితంగా చేయడానికి ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే.. సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.

Amazon Pay 'Smart Stores' to empower local merchants in India
అమెజాన్‌ పే 'స్మార్ట్‌ స్టోర్స్‌'తో కొనుగోలు మరింత సౌకర్యంగా!
author img

By

Published : Jun 26, 2020, 10:33 PM IST

వ్యాపార దిగ్గజ సంస్థ అమెజాన్‌కు చెందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఆఫ్‌లైన్‌ దుకాణాల్లో కూడా కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు చేయవచ్చని సంస్థ వివరించింది.

"దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది స్థానిక దుకాణాలు ఇప్పటికే అమెజాన్‌ పే పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ దుకాణాల్లో వినియోగదారులకు మరింత ఉత్తమమైన అనుభూతినిచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మా 'స్మార్ట్‌ స్టోర్స్‌' ద్వారా ఈ దుకాణాలు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతాయి."

-మహేంద్ర నెరూర్కర్‌, అమెజాన్‌ పే సీఈఓ

వినియోగదారులకు మరింత సదుపాయం

అమెజాన్‌ యాప్‌లో స్మార్ట్‌ స్టోర్స్ దుకాణాల క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేయటం ద్వారా వినియోగదారులు.. అక్కడ లభించే వివిధ వస్తువులను గురించి తెలుసుకోగలుగుతారు. తమకు కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకున్న అనంతరం.. వారు అమెజాన్‌ పే ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారు చెల్లింపులను అక్కడికక్కడే ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం కూడా దీనిలో లభిస్తుంది. ఆయా వస్తువులకు సంబంధించిన రివ్యూలను చదవగలుగుతారని.. దుకాణదారు సహాయం లేకుండానే వాటిపై లభ్యమయ్యే ఆఫర్లను కూడా తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.

స్థానిక దుకాణాల్లో అమ్మకాల పెంపు

స్మార్ట్‌ స్టోర్స్ విధానంలో లభించే ఈఎంఐలు, బ్యాంకు ఆఫర్లు, రివార్డుల ద్వారా కొనుగోళ్లు మరింత సులువుగా, లాభదాయకంగా మారుతాయి. అదేవిధంగా స్థానిక దుకాణాలు మరింత మంది వినియోగదారులను ఆకర్షించగలుగుతాయి. వినియోగదారులకు మంచి షాపింగ్‌ అనుభవం లభించటంతో పాటు...అమ్మకాలు పెరగడంతో వినియోగదారులు, దుకాణ దారులు ఇద్దరికీ ప్రయోజనకరమని సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్‌ తెలిపారు.

'స్మార్ట్‌ స్టోర్స్' ద్వారా పల్లెలు, చిన్న పట్టణాల్లో ఉండే సాధారణ దుకాణాలు కూడా డిజిటల్‌ విక్రయశాలలుగా మారనున్నాయి. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌ బజార్‌, మెడ్‌ప్లస్‌, మోర్‌ సూపర్‌ మార్కెట్లతో పాటు.. విశాఖపట్నం, జబల్‌పూర్‌ వంటి పట్టణాలు, వేలాది గ్రామీణ ప్రాంత దుకాణాలు కూడా అమెజాన్‌ పే స్మార్ట్‌ స్టోర్లుగా పరిణామం చెందాయని సీఈఓ మహేంద్ర అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.