ETV Bharat / business

అమెజాన్‌లో 20 వేల ఉద్యోగాలు - అమెజాన్​లో ఉద్యోగ అవకాశాలు

ప్రముఖ వ్యాపార సంస్థ అమెజాన్​... కరోనా సంక్షోభంలోనూ భారత్​లో 20వేల తాత్కాలిక ఉద్యోగాలను కల్పిస్తునట్టు వెల్లడించింది. ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

Amazon India to hire 20,000 temporary staff in customer service to serve global customers
అమెజాన్‌లో 20వేల ఉద్యోగాలు
author img

By

Published : Jun 28, 2020, 7:44 PM IST

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో సుమారు 20 వేల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ఆదివారం పేర్కొంది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అవసరమైన సేవలు అందించనుంది.

వారి అవసరాలు తీర్చడమే..

తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరునెలలపాటు వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ఇబ్బంది ఉండదని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌(వినియోగ దారుల సేవా విభాగం) అక్షయ్‌ప్రభు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు మరో పది నగరాల్లో ఉన్న తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

అవకాశాన్ని వినియోగించుకోవాలి!

ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2025 కల్లా ఇండియాలో సుమారు పదిలక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ అమ్మకాల జోరు పెరిగింది.

ఇదీ చూడండి: చుక్కలనంటిన ఫ్లాట్​ ధర.. కొన్నదెవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.