పండుగ సీజన్ నేపథ్యంలో దేశంలో లక్షకు పైగా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను సృష్టించినట్లు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా బుధవారం ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలు.. పండుగల సమయాల్లో వచ్చే భారీ ఆర్డర్లను సమర్థంగా నిర్వహించేందుకు వేల సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవడం సాధారణంగా జరుగుతుంటోంది.
కొత్త ఉద్యోగాలతో వినియోగదారులకు వేగంగా డెలివరీ అందడం సహా.. పండుగ సీజన్లో కంపెనీ డెలివరీ సామర్థ్యం కూడా పెరుగుతుందని అమెజాన్ పేర్కొంది.
ట్రాకింగ్ భాగస్వాములు, ప్యాకేజింగ్, 'ఐ హ్యావ్ స్పేస్' డెలవరీ పార్టనర్స్, అమెజాన్ ఫ్లెక్స్ భాగస్వాములు, హౌస్‌కీపింగ్ ఏజెన్సీల్లో కూడా పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించినట్లు అమెజాన్ పేర్కొంది. ఈ ఏడాది మేలో కూడా అమెజాన్ 70 వేల సీజనల్ ఉద్యోగ అవకాశాలు సృష్టించడం గమనార్హం.
2019లోనూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పండుగ సీజన్లో సప్లై సామర్థ్యం, గ్రామ స్థాయికి డెలివరీ అందించే ఉద్దేశంతో 1.4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రకటించడం గమనార్హం.
కరోనా నేపథ్యంలో ఉపాధి లేమి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ ఉద్యోగ అవకాశాలు చాలా ఉపయోగపడుతాయని పేర్కొంది అమెజాన్.
ఇదీ చూడండి:దేశంలో 5, 4 స్టార్ ఏసీల వినియోగం 14శాతమే!