ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌తో ముందుకొచ్చింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
దీపావళి సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఇవ్వనుంది అమెజాన్. ఈ ప్రత్యేక ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
10 శాతం డిస్కౌంట్ పొందండిలా..
గ్రేట్ ఇండియా ఫెస్టివల్ తాజా ఎడిషన్‌లో అమెజాన్ ఇండియా.. యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకుల భాగస్వామ్యంతో 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఆయా సంస్థలకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లు జరపడం ద్వారా ఈ ఆఫర్లు పొందొచ్చు. రూపే కార్డులతో జరిపే లావాదేవీలకూ ఈ ఆఫర్ వర్తించనుంది.
ప్రత్యేక ఆఫర్లున్న స్మార్ట్ఫోన్లు ఇవే..
షియోమీ ఇటీవల విడుదల చేసిన రెడ్ మీ నోట్ 8 ప్రో, రెడ్ మీ నోట్ 8 ఫోన్లు అమెజాన్ ఇండియాలో సోమవారం నుంచే కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కొనే వారికి 1120 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను ఎయిర్టెల్ ఇవ్వనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్, గెలాక్సీ ఏ10ఎస్, వీవో యూ10 మొబైళ్లపై రూ.1,000 వరకు తగ్గింపు ఇవ్వనుంది అమెజాన్.
ఇటీవల విడుదలైన నోకియా 6.2పైనా దీపావళి ప్రత్యేక ఆఫర్లో తాత్కాలికంగా ధర తగ్గింపు ఉండనుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రూ.15,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ రూ.14,499కి లభించనున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.29,999కి తగ్గించగా.. రెడ్ మీ 7ఏ రూ.4,999కే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
ఈ ప్రత్యేక పండుగ సీజన్లో భాగంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లయిన వన్‌ప్లస్ 7 ప్రో ధరను రూ.43,999కి, ఐఫోన్ ఎక్స్ఆర్ ధరను రూ.44,999కి తగ్గించి విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ అయిన పోకో ఎఫ్1 రూ.14,999కే లభ్యం కానుంది.
మొబైల్ ఫోన్ ఉపకరణాలు రూ.49నుంచి ప్రారంభం కానుండగా.. పవర్ బ్యాంకులు, హెడ్సెట్ వంటివి రూ.399 నుంచి లభ్యం కానున్నాయి. వీటికోసం తమ వైబ్సైట్లో ప్రత్యేక పేజీని కేటాయించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వీటితో పాటు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపైనా భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది.
గృహోపకరణాలపై భారీ ఆఫర్లు..
\దీపావళి సందర్భంగా నిర్వహిస్తోన్న ప్రత్యేక సేల్‌లో గృహోపకరణాలు, టీవీల వంటి ఎలక్ట్రానిక్ సాధనాలపై 60 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది అమెజాన్. వంట సామగ్రి వంటి వస్తువలపై 70 శాతం వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. నోకాస్ట్ ఈఎంఐ, డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
ఇదీ చూడండి: 'ఆ యాడ్లు అలా ఉంటే ఊరుకునేది లేదు'