ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ శనివారం 'హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్' పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వాటిని ఉపయోగించుకోవచ్చు. శనివారం నుంచే (అక్టోబర్ 24) ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆఫర్.. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్‌పై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రత్యేక ఆఫర్లో డిస్కౌంట్లు ఇలా..
స్మార్ట్ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సహా అనేక ఇతర ఉత్పత్తులను ప్రత్యేక తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది అమెజాన్. ప్రత్యేక తగ్గింపుతో పాటు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్ డెబిట్,క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ ప్రకటించింది.
అమెజాన్ అప్‌గ్రేడ్ హ్యాపీనెస్ సేల్ ఆఫర్లు..
- ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.6 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.12 నెలల వరకు 'నో కాస్ట్' ఈఎంఐ సదుపాయం
- శాంసంగ్ గెలాక్సీ ఎం51పై రూ.6,500 తగ్గింపు, 12 నెలల వరకు 'నో కాస్ట్' ఈఎంఐ సదుపాయం.
- శాంసంగ్ గెలాక్సీ ఎం21, ఎం31, ఎం31 ఎస్.. మోడళ్లకు 12 నెలల వరకు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్.
- వివో స్మార్ట్ఫోన్లపై 30 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు.. ఎక్స్ఛేంజ్ కింద మరో రూ.4,000 వరకు ప్రత్యేక తగ్గింపు. ఒప్పో మొబైల్ ఫోన్లపై రూ.23,000 వరకు తగ్గింపుతో పాటు.. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ.
- టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు.. రూ.291 ఈఎంఐ ప్లాన్ సహా 48 గంటల్లో ఇన్స్టాలేషన్ సదుపాయం.
- ల్యాప్‌టాప్‌లపై భారీగా రూ.30 వేల వరకు తగ్గింపు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ.35 వేల వరకు డిస్కౌంట్.
ఇదీ చూడండి:కేంద్రం పండుగ కానుక- రుణాలపై చక్రవడ్డీ మాఫీ