ETV Bharat / business

ఎల్​వీబీ ఖాతాదార్లకు అందుబాటులో అన్ని సేవలు - డీబీఎస్​ బ్యాంక్​ తాజా

లక్షీ విలాస్​ బ్యాంక్​ ఖాతాదారుల సేవింగ్స్​, ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి మార్పులేమీ లేవని డీబీఎస్​ బ్యాంక్​ ఇండియా తెలిపింది. నవంబర్​ 27నుంచి డీబీఎస్​ బ్యాంక్​ ఇండియాలో ఎల్​వీబీ విలీనం అమల్లోకి వచ్చింది.

LVB clients says dbs bank india
ఎల్​వీబీ ఖాతాదార్లకు అందుబాటులో అన్ని సేవలు
author img

By

Published : Dec 1, 2020, 7:12 AM IST

తమ బ్యాంకులో విలీనమైన లక్షీ విలాస్ బ్యాంక్ (ఎల్​వీబీ) వినియోగదార్లు అన్ని బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చని డీబీఎస్ బ్యాంక్​ ఇండియా వెల్లడించింది. అదే సమయంలో సేవింగ్స్​, ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి మార్పులేమీ లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వం, ఆర్​బీఐకి ఉన్న ప్రత్యేకాధికారాల కింద డీబీఎస్​ బ్యాంక్ ఇండియాలో ఎల్​వీబీ విలీనం నవంబర్​ 27 నుంచి అమల్లోకి వచ్చింది.

"తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు వడ్డీ రేట్లలో మార్పులు ఉండవు. అదే విధంగా ఎల్​వీబీ సర్వీసు షరతులు, నిబంధనల కిందే ఎల్​వీబీ ఉద్యోగులు కొనసాగుతారు. ఇప్పుడు వారంతా డీబీఎస్​ బ్యాంక్ ఇండియా ఉద్యోగులయ్యారు."

- డీబీఎస్​ బ్యాంక్​

రాబోయే కొద్ది నెలల్లో ఎల్​వీబీ నెట్​వర్క్​, వ్యవస్థను డీబీఎస్​లో ఏకీకృతం చేస్తామని డీబీఎస్​ ఇండియా వెల్లడించింది. అప్పుడు వినియోగదార్లకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.