ఇప్పటి నుంచి తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు హలోట్యూన్స్ సేవలు ఉచితంగా అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. 'ఎయిర్టెల్ థ్యాంక్స్' కార్యక్రమంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు చెప్పింది. వింక్ మ్యూజిక్ యాప్‌లో 15 భాషలకు చెందిన దాదాపు 4 కోట్ల పాటలు ఉంటాయని, వాటిలో దేన్నైనా వినియోగదారులు హలోట్యూన్గా పెట్టుకోవచ్చని తెలిపింది. ఇప్పటివరకు దీనికోసం నెలకు రూ.36 సబ్స్క్రిప్షన్ చార్జీలు వసూలు చేస్తుండగా, ఇప్పటి నుంచి ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది.
రూ.129 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్‌లో ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
పాట సెట్ చేసుకోండిలా..
హలోట్యూన్స్ సెట్ చేసుకోవడానికి ముందుగా లేటెస్ట్ వెర్షన్ వింక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, పాటను ఎంపిక చేసుకొని హలోట్యూన్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇష్టమైన పాటను కాల్ చేసిన వారికి వినిపించొచ్చు. హలోట్యూన్ను వినియోగదారులు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఉచిత హలోట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారులు ప్రతినెలా వింక్ యాప్ ద్వారా రెన్యూవల్ చేసుకోవాలని ఎయిర్టెల్ చెప్పింది.
ఇదీ చూడండి : టాబ్లెట్లు వీడి.. లాప్టాప్లపైనే దృష్టి