ETV Bharat / business

వ్యాపార సంస్థలకు ఎయిర్​టెల్​ బంపర్​ ఆఫర్​! - airtel latest news

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలోనే వ్యాపార సంస్థల ఉద్యోగుల కోసం 'వర్క్​ ఫ్రం హోం సొల్యూషన్స్​'ను ప్రారంభించింది ఎయిర్​టెల్​ సంస్థ.

Airtel launches 'work from home' solution for businesses
వ్యాపార సంస్థలకు ఎయిర్​టెల్​ బంపర్​ ఆఫర్​!
author img

By

Published : May 18, 2020, 11:50 PM IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న వేళ.. ప్రముఖ టెలికామ్​ సంస్థ ఎయిర్​టెల్​ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార​ సంస్థ ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి సమర్థవంతంగా, సురక్షితంగా పని చేసుకునేలా 'వర్క్​ ఫ్రం హోం సొల్యూషన్స్'​ను ప్రారంభించినట్లు తెలిపింది.

తమ కస్టమర్లు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా.. వైర్​లెస్​, డిజిటల్​ సాధానాలు, అత్యుత్తమ కనెక్టివిటీ వంటి సదుపాయాలను ఈ పద్దతి ద్వారా కల్పిస్తున్నట్లు ఎయిర్​టెల్​ వివరించింది.

"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొత్త తరహా పని విధానాలతో వ్యాపార సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచి పనులు చేయడం సర్వసాధారణమైపోయింది".

అజయ్​ చిత్కార, ఎయిర్​టెల్​ సంస్థ డైరెక్టర్​, సీఈఓ

వారికీ 4జీ నెట్​వర్క్​...

ప్లాటినమ్​ కార్పొరేట్​ పోస్ట్​పెయిడ్​ కస్టమర్లకు.. ప్రాధాన్యతతో కూడిన 4జీ నెట్​వర్క్​ సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. అత్యుత్తమ ఇండోర్​ కవరేజీని అందించడానికి వాయిస్​ఓవర్​ వైఫై(వీఓవైఫై) సదుపాయాన్ని కల్పించనున్నట్లు వివరించింది. 5లక్షలకు పైగా మైక్రో, చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు 2,500 పెద్ద కంపెనీలకు ఎయిర్​టెల్​ సేవలను అందిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.