ETV Bharat / business

​​​​​​​5జీ ట్రయల్స్​కు టెలికాం దిగ్గజాల సన్నాహాలు! - 5జీ న్యూస్​ లేటెస్ట్​

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న.. 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికాం దిగ్గజాల ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో 5జీ ట్రయల్స్​ నిర్వహించేందుకు ఎయిర్​టెల్​, జియో, వొడాఫోన్​ ఐడియా సంస్థలు టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

5g technology
5జీ టెక్నాలజీ
author img

By

Published : Jan 16, 2020, 5:00 AM IST

భారత్​లో 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం దిగ్గజాలు ఎయిర్​టెల్, జియో, వొడాఫోన్ ఐడియా.. టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమచారం మేరకు 5జీ ట్రయల్స్​ కోసం ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాలు.. హువావే, జెడ్​టీఈ, ఎరిక్సన్​, నోకియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా జియో.. శాంసంగ్​తో చేతులు కలిపినట్లు తెలిసింది.

ఆ ప్రకటనే సానూకూలతలు పెంచింది..

సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ గత నెలలో.. ప్రభుత్వం ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం సంస్థలకు 5జీ సిగ్నల్స్​ను అందివ్వనున్నామని తెలిపారు. ఈ ట్రయల్​కు ఉపకరణాలు అందించే సంస్థలపై ఎలాంటి అంక్షలు లేవని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆంక్షలు ఎదుర్కొంటున్న హువావేకు ఊరటనిచ్చినట్లయింది. ఇది 5జీ ట్రయల్స్​కు మరింత సానుకూలతలు పెంచింది.

టెలికాం రంగంలో చైనా సంస్థల సేవలను వినియోగించుకునేందుకు చాలా దేశాలు అవకాశమిచ్చాయి. ఇప్పుడు భారత్​ కూడా.. అదే విధానాన్ని పాటిస్తూ ఏ సంస్థ అయినా 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.

మార్చిలోపు ట్రయల్స్​..

అన్ని కుదిరితే ఈ నెలాఖరు నుంచి మార్చిలోపు టెలికాం సంస్థలు 5జీ ట్రయల్స్ నిర్వహించే అవకాశముంది. ఈ విషయంపై సెల్యూలార్​ ఆపరేటర్స్​ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా (సీఓఏఐ) డీజీ రాజన్​ మాథ్యూస్​ స్పందించారు. జాతీయ డిజిటల్​ సమాచార విధానాన్ని అమలు చేసేందుకుగానూ.. 5జీ ట్రయల్స్ ప్రతిపాదనను డీఓటీ ముందు ఉంచడం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:డిసెంబర్​లోనూ నిరాశపరిచిన భారత ఎగుమతులు!

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL102
DL-JAMIA-COURT
Jamia university to move court for registration of FIR against Delhi Police
         New Delhi, Jan 15 (PTI) The Jamia Millia Islamia will move court for registration of FIR against Delhi Police, varsity officials said on Wednesday.
          The decision to move court was taken at an emergent Executive Council meeting, they said.
          According to the officials, the varsity will move court seeking it to direct police to register FIR in connection with the police action on campus on December 15. PTI SLB
RCJ
01151836
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.