దేశ ఎగుమతుల్లో వరుసగా ఐదో నెలలోనూ తగ్గుదల నమోదైంది. 2019 డిసెంబర్లో దేశీయ ఎగుమతులు 1.8 శాతం క్షీణించి.. 27.36 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దిగుమతుల్లోనూ..
డిసెంబర్లో దిగుమతులూ 8.83 శాతం తగ్గి.. 38.61 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది ప్రభుత్వం.
సమీక్షా నెలలో వాణిజ్య లోటు 11.25 బిలియన్ డాలర్లుకు చేరింది. 2018 డిసెంబర్లో వాణిజ్య లోటు 14.49 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.
ఆయిల్ దిగుమతులు 0.83 శాతం తగ్గి.. 10.69 బిలియన్ డాలర్లుకు, బంగారు దిగుమతులు 4 శాతం తగ్గి.. 2.46 బిలియన్ డాలర్లకు చేరాయి.
గడిచిన తొమ్మిది నెలల్లో ఇది పరిస్థితి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎగుమతులు 1.96 శాతం క్షీణించి 239.29 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 8.9 శాతం తగ్గి.. 357.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ తొమ్మిది నెలల కాలంలో వాణిజ్య లోటు 118.10 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:సమ్మె సైరన్: ఈనెల 31, ఫిబ్రవరి 1న బ్యాంకులు బంద్