చాలా కాలంగా నేలకే పరిమితమైన 17 విమానాల కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్విని లోహాని వెల్లడించారు.
ఈ విమానాల్లో 4 నెలల నుంచి ఏడాదిలోపు కార్యకలాపాలకు దూరమైనవి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో వాటిని నిర్వహించలేక కార్యకలాపాలు నిలిపేసింది ఎయిర్ ఇండియా.
17 విమానాల్లో ఎనిమిదింటిని ఆగస్టు చివరి నాటికి.. మిగతా 9 విమానాలను అక్టోబర్ చివరి నాటికి పువరుద్ధరించాలని ఎయిర్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
ఎయిర్ ఇండియా నుంచి మరిన్ని అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభిస్తామని.. పౌర విమానయాన మంత్రి సర్దీప్ సింగ్ పూరి కొన్ని వారల క్రితం ప్రకటన చేశారు. ఆ తర్వాతే ఎయిర్ ఇండియా ఈ పునరుద్ధరణ ప్రణాళిక ప్రకటించడం గమనార్హం.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా రూ.7,600 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. అదే సమయానికి సంస్థ పూర్తి రుణ భారం రూ.58,300 కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'ఉల్లంఘన' కేసులో అనిల్ అంబానీకి ఊరట