ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎయిర్ ఇండియాకు షాక్ ఇచ్చాయి. బాకాయిలు చెల్లించని కారణంగా విమానాలకు ఇంధన సరఫరా నిలిపేశాయి.
దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలకు(విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచీ, పుణే, పట్నా) ఇంధన సరఫరా ఆపేసినట్లు చమురు సంస్థల సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్ ఇండియాకు 'ఎటీఎఫ్' సరఫరా అపేసిన సంస్థల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఉన్నాయి.
గత ఏడు నెలల నుంచి ఆయా సంస్థలన్నింటికీ కలిపి మొత్తం రూ.4,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఎయిర్ఇండియా.
ఈ మూడు సంస్థలు వారం క్రితమే ఎయిర్ఇండియాకు బకాయిలు చెల్లించమని నోటీసులు అందించాయి. గడువులోగా చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. అయినప్పటికీ బకాయిల చెల్లింపులో ఎయిర్ఇండియా విఫలమైంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలకు ఉపక్రమించాయి చమురు సంస్థలు.
అధికారిక గణాంకాల ప్రకారం ఎయిర్ఇండియాకు మొత్తం రూ.58,000 కోట్లకు పైగా రుణభారం ఉంది.
ఇదీ చూడండి: ఏడాదిలో 4,600 కోట్ల జీబీ డేటా వాడేశాం