ETV Bharat / business

'మేం చెల్లించాల్సిన బకాయిలు రూ.21,533 కోట్లే'

ఏజీఆర్​ బకాయిలకు స్వీయ మదింపులో తాము చెల్లించాల్సిన విలువ రూ.21,533 కోట్లుగా తేలిందని వోడాఫోన్​ ఐడియా ప్రకటించింది. ఈ విషయాన్ని టెలికాం విభాగానికి తెలియజేశామని స్పష్టంచేసింది.

voda
వొడాఫోన్​
author img

By

Published : Mar 7, 2020, 10:37 AM IST

ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిల విలువ రూ.21,533 కోట్లు అని వొడాఫోన్‌ ఐడియా లెక్కగట్టింది. ఈ మేరకు ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. టెలికాం విభాగం(డీఓటీ) అంచనా వేసిన రూ.53,000 కోట్లలో ఇది సగం కంటే తక్కువ.

"స్వీయ మదింపు అనంతరం టెలికాం బకాయిల వివరాలను డీఓటీకి సమర్పించాం. మేం కట్టాల్సిన బకాయిల విలువ రూ.21,533 కోట్లుగా లెక్క తేలింది. ఇప్పటికే రూ.3,500 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాం. 2006-07 నుంచి 2018-19 కాలానికి అసలు రూ.6,854 కోట్లు, 2020 ఫిబ్రవరి వరకు వడ్డీ కూడా ఇందులో కలిసి ఉన్నాయి."

- వొడాఫోన్‌ ఐడియా

ప్రభుత్వానికి చెల్లించిన బకాయిలను లెక్కించేటప్పుడు టెలికాం కంపెనీలు ఆర్జించిన అన్ని రకాల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటామని గతేడాది అక్టోబరులో డీఓటీ వెల్లడించింది. ఆ ప్రకారమే వొడాఫోన్‌ ఐడియా రూ.53,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని అంచనా వేసింది.

ఈ బకాయిల నిమిత్తం 2020 ఫిబ్రవరి 17న రూ.2,500 కోట్లు, 2020 ఫిబ్రవరి 20న మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. మరోవైపు వొడాఫోన్‌ గ్రూపు గ్లోబల్​ సీఈఓ నిక్‌ రీడ్‌ శుక్రవారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సహా పలు మంత్రులను కలిశారు. అయితే మంత్రులతో ఆయన ఏయే విషయాలపై చర్చించారో వెల్లడికాలేదు.

ఇదీ చూడండి: ఏజీఆర్​, స్పెక్ట్రం బకాయిల చెల్లింపులు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.