దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న టెలికాం కంపెనీల నుంచి సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల(ఏజీఆర్) బకాయిలను ఎలా రాబట్టుకోవాలని ప్రణాళిక వేశారో తెలపాలంటూ టెలికాం విభాగాన్ని(డాట్) సుప్రీంకోర్టు కోరింది. ఈ కంపెనీలకిచ్చిన స్పెక్ట్రమ్‌ను అవి విక్రయించవచ్చా అని ప్రశ్నించింది. దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న టెలికాం కంపెనీలు వాటిని విక్రయించలేవని.. అది వారి ఆస్తి కాదని కోర్టుకు డాట్ వెల్లడించింది.
'ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, వీడియోకాన్ వంటి కంపెనీలు దివాలాకెళితే బకాయిల సంగతి ఏమిటి? ఆర్‌కామ్ నుంచి రూ.31,000 కోట్లు; ఎయిర్‌సెల్‌నుంచి రూ.12,000 కోట్లు ఎలా రాబడతారో చెప్పండి అని 14కు కేసు వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎస్ అబ్దుల్ నజీర్, ఎమ్.ఆర్. షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.