ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల్లో మరికొంత మొత్తాన్ని చెల్లించింది. టెలికాం విభాగం (డాట్) వద్ద రూ.8,004 కోట్లు ఏజీఆర్ బకాయి కింద నేడు జమచేసినట్లు ఎయిర్టెల్ తెలిపింది.
ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఎయిర్టెల్ ఇప్పటికే ఫిబ్రవరి 17న రూ.10,000 కోట్లు చెల్లించింది. తాజా చెల్లింపుతో ఎయిర్టెల్ మొత్తం ఏజీఆర్ బకాయి జమ రూ.18,004 కోట్లకు చేరింది. అయితే ఈ సంస్థ మొత్తం రూ.35,000 కోట్లకుపైగా ఏజీఆర్ బకాయి పడింది.
ఏజీఆర్ బకాయిల వివరాల కోసం ఇవీ చదవండి: