ETV Bharat / business

'కింగ్​ఫిషర్​కో న్యాయం... జెట్​​కో న్యాయమా..?' - జెట్​ ఏయిర్​వేస్​

కర్ణాటక హైకోర్టు వద్ద ఉన్న తన ఆస్తులను అమ్మి జెట్​ ఎయిర్​వేస్​ను కాపాడాలంటూ బ్యాంకులకు చురకలంటించారు విజయ్​ మాల్యా. తాను సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బ్యాంకులు ముందుకురాకపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తోందన్నారాయన. ఎన్డీఏ హయాంలో బ్యాంకులు ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు మాల్యా.

మాల్యా
author img

By

Published : Mar 26, 2019, 1:09 PM IST

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూలండన్​లో తలదాచుకుంటున్న వ్యాపారి విజయ్​ మాల్యా... మరోమారు భారతీయ బ్యాంకుల తీరును తప్పుబట్టారు. ఎన్డీఏ హయాంలో బ్యాంకులు ద్వంద్వనీతిప్రదర్శిస్తున్నాయని దుయ్యబట్టారు.

కర్ణాటక కోర్టుకు సమర్పించిన తన లిక్విడ్ ఆస్తులు అమ్మి... ఆ సొమ్ముతో అర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్​ ఎయిర్​వేస్​ను గట్టెక్కించాలంటూ బ్యాంకులకు చురకలంటించారు.

జెట్ ఎయిర్​వేస్​ను ఆదుకున్న బ్యాంకులు తన కింగ్​ఫిషర్​ ఎయిర్​లైన్స్​ సంస్థను మాత్రం అన్యాయంగా ముంచేశాయని విమర్శించారు మాల్యా. జెట్ ఎయిర్​​వేస్​​ను​ గట్టెక్కించేందుకు సంస్థ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ తీసుకోవడాన్ని మాల్యా అభినందించారు.

కింగ్​ ఫిషర్​ను కూడా ఇలానే ఆదుకుని ఉంటే బాగుండేదని అయన అన్నారు. ఉత్తమ ఉద్యోగులతో, భారత్​లో అత్యుత్తమ విమాన సంస్థగా ఉన్న కింగ్​ఫిషర్ ఎయిర్​లైన్స్​పై కనికరం చూపలేదని విజయ్​ మాల్యా విమర్శించారు.

"నేను మళ్లీ చెబుతున్నా. రుణదాతలకు అప్పు చెల్లించేందుకు నా లిక్విడ్​ ఆస్తులను కర్ణాటక హైకోర్టు ముందుంచా. బ్యాంకులెందుకు నా వద్ద డబ్బులు తీసుకోవడం లేదు? అ ఆస్తులు జెట్ ఎయిర్​వేస్​​ను ఆదుకోడానికి పనికొస్తాయేమో చూడండి" -ట్విట్టర్​లో విజయ్​ మాల్యా

mallya tweet
మాల్యా ట్వీట్​

"కింగ్​ ఫిషర్​ను, సంస్థ ఉద్యోగులను రక్షించేందుకు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టాను. నా కృషిని ఎవరూ పట్టించుకోకపోగా, వీలైనంతగా నాపై దాడిచేశారు. కింగ్​ ఫిషర్​ పట్ల ఒకలా, జెట్​ ఎయిర్​వేస్ పట్ల మరోలా వ్యవహరిస్తున్న బ్యాంకులు గొప్పవి. మీడియా కూడా ప్రధానికి లేఖ రాస్తానంటే నా పట్ల అలానే వ్యవహరించింది. ఎన్డీఏ సర్కారు రాగానే అంతగా ఏం మారిందో అర్ధం కావట్లేదు." -మాల్యా

AP Video Delivery Log - 0500 GMT News
Tuesday, 26 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0435: US DC Mueller Schumer Reaction AP Clients Only 4202795
Schumer calls for release of Mueller report
AP-APTN-0305: SKorea Belgium AP Clients Only 4202794
Belgium's King Philippe meets SKorean president
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.