ETV Bharat / business

'ఎస్​ బ్యాంకులో ఇక నగదు సమస్యలు ఉండవు'

author img

By

Published : Mar 17, 2020, 8:38 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనల అనంతరం ఎస్​ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియాన్ని ఎత్తివేసింది. దీంతో బ్యాంకు కార్యకలాపాలు రేపటి నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్​ బ్యాంకు నూతన సీఈఓ కీలక ప్రకటన చేశారు. అన్ని ఏటీఎంలు, శాఖల్లో సరిపడా డబ్బు ఉంటుందని, వినియోగదారులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

yes bank crisis
ఎస్​ బ్యాంకు సేవలు యథాతథం

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్​ బ్యాంకు రేపటి నుంచి యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో లిక్విడిటీకి (డబ్బులకు) ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు బ్యాంకు నూతన సీఈగా నియమితులైన ప్రశాంత్ కుమార్.

భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎస్​ బ్యంకుపై ఈ నెల 5న ఆర్బీఐ మారటోరియం విధించింది. వినియోగదారులు రూ.50,000 వరకు మాత్రమే నగదు ఉపసంహరణకు అనుంతించింది. బ్యాంకును సంక్షోభం నుంచి బయటకు లాగేందుకు కేంద్రం ఉద్దీపనలు ప్రకటించగా.. రేపు (మార్చి 18) సాయంత్రం 6 గంటలకు మారటోరియం ఎత్తివేయనుంది ఆర్బీఐ.

"మేం తగినన్ని చర్యలు తీసుకున్నాం. మా ఏటీఎంలు అన్నింటిలో నగదు కొరత ఉండదు. బ్యాంకు శాఖల్లోనూ సరిపడ డబ్బు ఉంటుంది. కాబట్టి నగదుకు సంబంధించి ఎస్ బ్యాంకు వైపు నుంచి కచ్చితంగా ఎలాంటి సమస్యలు లేవు." - ప్రశాంత్​ కుమార్​

బ్యాంకు వినియోగదారులెవ్వరూ తమ డిపాజిట్లపై ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. బ్యాంకుపై మారటోరియం ఎత్తివేసిన అనంతరం మునుపటిలానే బ్యాంకు సేవలు అన్ని తిరిగి కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:మే 31 వరకు బీఎస్​-4 వాహనాల విక్రయం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.