అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడొచ్చనే అంచనాల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. జీ20 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వాణిజ్య చర్చలకు అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 225 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,619 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 11,853 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభనష్టాల్లోనివివే..
ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, మారుతి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ప్రత్యేకం: జీఎస్టీ ప్రస్థానానికి రెండేళ్లు