ETV Bharat / business

'విద్యుత్​ వాహనాలా.. అవేమన్నా ఆధార్ కార్డులా?'

100 శాతం ద్వి చక్ర, త్రి చక్ర వాహనాలను విద్యుత్తుతో నడిచేలా చేయాలన్న నీతి ఆయోగ్​ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి ఆటోమొబైల్​ సంస్థలు. విద్యుత్​ వాహనాలుగా మార్చాలనుకునే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిఉంటుందని సూచించాయి. ఇది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాయి దిగ్గజ వాహన తయారీ సంస్థలు.

author img

By

Published : Jun 25, 2019, 12:38 PM IST

'విద్యుత్​ వాహనాలా.. అవేమన్నా ఆధార్ కార్డులా?'

అన్ని ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలన్న నీతిఆయోగ్​ ప్రతిపాదనను దిగ్గజ వాహన తయారీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మార్పు ఆటోమొబైల్​ రంగాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తుందని.. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని హీరో మోటోకార్ప్​ లిమిటెడ్, బజాజ్​ ఆటో, టీవీఎస్​ మోటార్​ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

2025కల్లా 100 శాతం బైక్​లు, ఆటోలు విద్యుత్​తో నడిచేలా చేసేందుకు.. తదనుగుణ చర్యలు తీసుకోవాలని ఆటో మొబైల్​ రంగాన్ని గతవారం కోరింది నీతిఆయోగ్​. 2 వారాల్లోగా ఈ అంశంపై స్పందించాలని స్పష్టం చేసింది.

అయితే.. ఈ నీతిఆయోగ్​ ప్రతిపాదన.. సాధ్యమయ్యే పనికాదని వాహన తయారీ సంస్థలు పేర్కొన్నాయి. ఆధార్​ కార్డు ముద్రించినంత సులభంగా.. ప్రస్తుతం తయారు చేస్తున్న వాహనాలను విద్యుత్తులోకి మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొన్నారు టీవీఎస్​ మోటార్స్​ ఎండీ వేణు శ్రీనివాసన్​.

''ఇది ఆధార్‌ కార్డు కాదు. సాఫ్ట్‌వేర్, ప్రింట్‌ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది. తగిన ప్రణాళికలను 4 నెలల్లో రూపొందిస్తామని చెప్పాం. అత్యధిక ద్విచక్ర వాహనాలున్న ఒక నగరంతో ప్రారంభించి, క్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాలి. ''

- వేణు శ్రీనివాసన్​, టీవీఎస్​ మోటార్స్​ సంస్థ ఎండీ

ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హీరో మోటోకార్ప్​ లిమిటెడ్​. 150 సీసీ లోపు సంప్రదాయ ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలనే నీతిఆయోగ్​ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేసింది.

''2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్న ప్రమాణాల వల్ల, ప్రపంచంలోనే అధిక ఇంధన సామర్థ్యంతో పనిచేస్తూ, అతి తక్కువ ఉద్గారాలు మాత్రమే వెదజల్లేలా మన ద్విచక్ర వాహనాలుంటాయి. విద్యుత్​ వాహనాలుగా మార్చాలనుకునేముందు వినియోగదారుల అంగీకారం, మార్కెట్‌ పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కసారిగా అన్నీ మారాలంటే.. తయారీ, విడిభాగాల సంస్థలు, అమ్మకం దార్లు, మెకానిక్​లకు ఇలా అన్ని విధాలా వీలు కాదు. ఫలితంగా.. కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. అందువల్ల దశలవారీగా అమలు చేయడమే పరిష్కారం.''

- హీరో మోటోకార్ప్​ లిమిటెడ్

ద్విచక్ర, త్రి చక్ర వాహనాలన్నీ 100 శాతం విద్యుత్తుతోనే నడిపించాలన్న ప్రతిపాదన సరైనది కాదని అభిప్రాయం తెలిపారు బజాజ్​ ఆటో ఎండీ రాజీవ్​ బజాజ్​. నిశితంగా పరిశీలించి.. అధ్యయనం చేయాలన్నారు. దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Yokohama – 25 June 2019
1. Various of Nissan shareholders walking into Nissan's annual general shareholders meeting
2. SOUNDBITE (Japanese) Keiko Maruyama, Nissan shareholder:
"The series of the reports made me wonder how they will handle the company and the situation from now on. I would like to hear from them whether they plan to rebuild the company."
3. People walking near the venue of the shareholders meeting  
4. SOUNDBITE (Japanese) Hiroshi Kodaka, Nissan shareholder:
"The situation indeed keeps changing every minute. I am curious to know when the company situation will get stabilized and when the company can make us feel safe as shareholders."
5. Various of people walking into the shareholder meeting
STORYLINE:
Nissan shareholders arrived with questions for the leadership at the company's annual meeting at the automaker's headquarter in Yokohama.
Shareholder Hiroshi Kodaka said is hoping for safety and stability in the wake of the misconduct scandal surrounding ousted chairman Carlos Ghosn.
On her way into the shareholders' meeting, Keiko Maruyama said she wanted to hear from Nissan about plans to rebuild the company after Ghosn was arrested for financial misconduct charges last year.
Ghosn led Nissan for two decades, saving it from near-bankruptcy, and served as chairman at Nissan, Renault and Mitsubishi.
He has been charged with falsifying financial reports in underreporting retirement compensation and with breach of trust in having Nissan shoulder investment losses and in diverting Nissan money for personal gain.
Ghosn says he is innocent.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.