ETV Bharat / business

'ఉద్యోగాల్లో పెరిగిన లింగ వివక్ష' - లింక్డ్ఇన్ ఆపర్చునిటీ ఇండెక్స్​ 2021

కుటుంబ బాధ్యతల వల్ల 69 శాతం మంది పని చేసే తల్లులు వివక్షను ఎదుర్కొంటున్నట్లు లింక్డ్​ఇన్ తాజా సర్వేలో వెల్లడైంది. కరోనా కాలంలో లింగ వివక్ష పెరిగినట్లు తేలింది.

Gender bias rise in Covid times
కరోనాతో పెరిగిన లింగ వివక్ష
author img

By

Published : Mar 2, 2021, 2:15 PM IST

కరోనా వల్ల మహిళా ఉద్యోగుల విషయంలో అసమానతలు పెరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది. తమ ఎదుగుదల, పదోన్నతులు కరోనా వల్ల పెరిగిన లింగ వివక్షతో ప్రభావితమైనట్లు సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది మహిళలు తెలిపారు. 'లింక్డ్ఇన్ ఆపర్చునిటీ ఇండెక్స్​ 2021' పేరుతో విడుదలైన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సర్వేలోని మరిన్ని వివరాలు..

  • కుటుంబ బాధ్యతల వల్ల 69 శాతం మంది పని చేసే తల్లులు వివక్షను ఎదుర్కొంటున్నారు.
  • కరోనా వల్ల తమపై ప్రతికూల ప్రభావం పడినట్లు 89 శాతం మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
  • 66 శాతం మంది మాత్రం తమ ముందు తరంతో పోలిస్తే.. లింగ సమానత్వం మెరుగైందని తెలిపారు. అయితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మాత్రం పని చేసే మహిళల్లో అత్యధిక లింగ వివక్ష భారత్​లోనే ఉందని సర్వే పేర్కొంది.
  • తాము పని చేసే కంపెనీలు పురుషులకు సానుకూలంగా వ్యవహరించడం.. తమ భవిష్యత్ పురోగతి విషయంలో అసంతృప్తికి కారణమని 22 శాతం మంది పని చేసే మహిళలు పేర్కొన్నారు.
  • తమకు తక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని 25 శాతం మంది పురుషులు మాత్రమే అంగీకరిస్తున్నట్లు 37 శాతం మంది మహిళలు చెప్పారు.
  • ఉద్యోగ భద్రత, ఇష్టమైన పని, వృత్తి, వ్యక్తిగత జీవిత సమతుల్యత.. ఈ మూడూ భారత్​లో ఉద్యోగం విషయంలో మహిళలు, పురుషులు కోరుకునే ముఖ్యమైన అంశాలు.
  • ఇరువురికి ఇలాంటి లక్ష్యాలే ఉన్నా.. జెండర్ ముఖ్యమని ఎక్కువ మంది మహిళలు (63 శాతం) భావిస్తున్నారు.
  • ప్రతి ఇద్దరిలో ఒకరి కంటే ఎక్కువ మంది వృత్తిపరమైన సంబంధాలు పెరగాలని, తమ భవిష్యత్​కు ఉపయోగపడే మెంటర్ అవసరమని భావిస్తున్నారు. సరైన ప్రోత్సాహం, గైడెన్స్​ లేకపోవడం అవకాశాలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అనుకుంటున్నారు.

ఇదీ చదవండి:ముకేశ్, మస్క్​ పోటాపోటీ.. సంపదలో కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.