భారత ఐటీ రంగంలో వృద్ధి నెమ్మదించిందని.. అది మధ్య శ్రేణి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రముఖ ఐటీ రంగ నిపుణులు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు 30వేల నుంచి 40వేల మంది వరకు మధ్యశ్రేణి ఉద్యోగులను తొలగించే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘ఇతర దేశాల్లో లాగా భారత్‌లోని ఐటీ కంపెనీలు కూడా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాయి. మంచి వృద్ధి నమోదు చేసినప్పుడు ప్రమోషన్లు సాధారణమే. అయితే వృద్ధి తగ్గుతున్నప్పుడు మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా మధ్యశ్రేణి ఉద్యోగులపైనే పడుతుంది. ఆ స్థాయి ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు మొగ్గుచూపుతుంటాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఇలాంటి ప్రక్రియలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఐటీ రంగంలో 30వేల నుంచి 40వేల ఉద్యోగాలు పోవచ్చు’ అని పాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఉద్యోగాలు కోల్పోయే వారిలో 80శాతం మందికి ఇతర రంగాల్లో మళ్లీ ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఇదీ చూడండి:భారత్-నేపాల్ మైత్రికి 'కాలాపానీ' బీటలు!