ETV Bharat / business

'లింక్డ్​ఇన్​ ద్వారా నిమిషానికి ముగ్గురు నియామకం' - ఉద్యోగం కోసం లింక్డ్​ఇన్​వైపు అభ్యర్థుల చూపు

లింక్డ్ఇన్ ద్వారా నియామకాలపై కీలక విషయాలు వెల్లడించింది మైక్రోసాప్ట్. తమ ప్లాట్​ఫామ్​ ద్వారా ప్రతి నిమిషానికి 3 నియామకాలు జరుగుతున్నట్లు తెలిపింది.

hiring activity rise in LinkedIn
లింక్డ్​ఇన్​లో పెరిగిన నియామకాలు
author img

By

Published : Oct 29, 2020, 3:17 PM IST

ప్రముఖ ప్రొఫెషనల్ నెట్​వర్క్ ప్లాట్​ఫామ్ లింక్డ్ఇన్​ ద్వారా నిమిషానికి మూడు నియామకాలు అవుతున్నట్లు.. దాని మాతృసంస్థ మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్యనాదెళ్ల తెలిపారు.

చాలా మంది ప్రొఫెషనల్స్​ తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు లింక్డ్ ఇన్ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. వారంతా వారానికి 10 లక్షల గంటల కంటెంట్​ను చూస్తున్నారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికమని వివరించారు.

"మార్కెటింగ్ సొల్యుషన్స్​ పరంగా లింక్డ్ఇన్​లో అడ్వయిజర్ డిమాండ్ దాదాపు కరోనా ముందు స్థాయికి చేరింది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 40 శాతం పెరిగింది. మార్కెటర్లు మా టూల్స్ వాడుకునని వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్న నిపుణులను అనుసంధానమవగలుగుతున్నారు."

-సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ

ఇదీ చూడండి:కరోనాతో బంగారానికి డిమాండ్ డౌన్- కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.