ETV Bharat / business

రివ్యూ 2020: అంకురాలకు కొత్త అనుభవం - 2020లో స్టార్ట్​ప్​లో ఎదుర్కొన్న ఇబ్బందులు

చిన్న పాటి అనిశ్చితులకే విలవిలలాడే అంకుర సంస్థలకు ఈ ఏడాది కరోనా రూపంలో భారీ సంక్షోభం ఎదురైంది. కొవిడ్​ దెబ్బకు చిన్న సంస్థలు ఓ కుదుపునకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో అంకురాల వ్యాపారల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద 2020లో అంకుర సంస్థలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాయి. మారిన పరిస్థితులతో వాటికి ఎలాంటి వ్యాపార అవకాశాలు లభించాయి? ఈ ఏడాది స్టార్టప్​లకు ఎలాంటి అనుభవాలను మిగిల్చింది? అనే అంశంపై ఓ ప్రత్యేక కథనం.

Corona impact on Start ups in India
అంకురాల పై కరోనా ప్రభావం
author img

By

Published : Dec 25, 2020, 10:42 AM IST

కరోనా వల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దిగ్గజ సంస్థలూ అనేక ఆటుపోట్లు ఎదుర్కోగా.. అంకురాలు ఏకంగా వ్యాపారాలను రీసెట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంకురాల వ్యాపార వాతావరణంతో పాటు వాటి వ్యవహార శైలిలోనూ అనేక మార్పులకు కారణమైంది కరోనా సంక్షోభం.

సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ.. డిజిటల్ ప్లాట్​ఫాంల వినియోగం భారీగా పెరగటం సహా చైనా యాప్​ల నిషేధం వంటివి అంకురాలకు అవకాశాలు పెంచాయి. దీనితో అంకురాలు ప్రధాన వ్యాపార విభాగాల్లో చోటు సంపాదించగలిగాయి.

వీటన్నింటితో పాటు ఈ ఏడాది అంకురాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి? కరోనా సంక్షోభంతో చిన్న సంస్థల వ్యాపారాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? కరోనా సంక్షోభం అంకురాలకు ఎలాంటి అవకాశాలు సృష్టించింది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బీ2సీ డిమాండ్ లో పెరుగుదల

వినియోగదారులకు వస్తువులను, ఉత్పత్తులను అమ్మే అంకురాలు లేదా బిజెనెస్ టూ కన్సూమర్ మోడల్ అంకురాలు.. కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​తో ఎక్కువగా లబ్ధిపొందాయి. భౌతికంగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే వీలు లేకపోవటం వల్ల ఎక్కువ మంది ఆన్​లైన్​ షాపింగ్​కు ప్రాధాన్యం ఇచ్చారు.

భౌతిక దూరం నిబంధన ఎడ్యూటెక్, ఫిన్​టెక్, హెల్త్​టెక్, ఫుడ్​టెక్ రంగంలోని కంపెనీలకు వరంగా మారింది. ఈ రంగాల్లోని కొన్ని అంకురాలు ఐదు సంవత్సరాల్లో గడిస్తామనుకున్న ఆదాయం.. ఈ ఏడాదిలోనే సాధించాయని నిపుణులు చెబుతున్నారు.

లాక్​డౌన్​ వల్ల చాలా మంది ఇంటికే పరిమితమైన కారణంగా.. డేటా వినియోగం భారీగా పెరిగింది. ఇది బీ2సీ యాప్​లకు సంబంధించిన అంకురాలకు కొత్త దారులను తెరిచింది.

నెలవారీగా, సంవత్సరం వారీగా లేదా నిర్ణీత సమయం వారీగా సబ్​స్క్రిప్షన్ చేసుకుని కావాల్సిన కంటెంట్​ను చూసేందుకు భారతీయులు అలవాటు పడుతున్నారు. ఈ మోడల్​ను అంకురాలకు ఆదాయం తెచ్చే వనరుగా కరోనా తర్వాతే గుర్తించడం విశేషం.

డిజిటల్ మీడియా సంస్థలు, విద్యకు సంబంధించిన యాప్​లు, మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్​లతో పాటు ఇతర సంస్థలు ఈ మోడల్​ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

'సాస్' కు పెరిగిన డిమాండ్

ఇంటర్నెట్​లో అప్లికేషన్లను డెలివరీ చేసే విధానమే సాఫ్ట్ వేర్ యాస్ సర్వీసెస్(సాస్) మోడల్. దీనివల్ల అప్లికేషన్​ను కంప్యూటర్​లో ఇన్​స్టాల్ చేసుకునే అవసరం ఉండదు. ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

సాస్ మోడల్ ద్వారా అవసరం ఉన్న అప్లికేషన్లను కంపెనీలు అందుబాటు ధరకే ఉపయోగించుకోవచ్చు. సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసేందుకు, ఇతర డిజిటల్ మౌలిక సదుపాయాల సమకూర్చుకునేందుకు నిధులు తక్కువున్న కంపెనీలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

కరోనా మహమ్మారి వినియోగదారులతో వ్యాపార సంస్థలు మాట్లాడే తీరులో భారీ మార్పులకు కారణమైంది. డిజిటల్ వేదికగా వినియోగదారులతో కనెక్ట్ అయి ఉండేందుకు వీలుగా టూల్స్ అవసరాన్ని పెంచింది. దీనితో సాస్ విభాగంలోని అంకురాలకు భారీ డిమాండ్ పెరిగింది.

బెన్ అండ్ కో ఇటీవలి నివేదిక ప్రకారం జోహో, ఫ్రెష్ వర్క్స్, ధ్రువ తదితర కంపెనీలు 100 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయ మార్కును దాటినట్లు తెలిసింది. సాస్ విభాగంలోని అంకురాలకు పెరిగిన డిమాండ్​ను తెలుసుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలంటే ఆశ్చర్యం కాదు.

భారత దేశంలో యూనికార్న్​గా మారిన ఐదో సాస్ ఆధారిత కంపెనీగా 'జనోటి' ఇటీవల ఘనత సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్పా, సెలూన్, మెడ్​ స్పాలకు క్లౌడ్ ఆధారిత సాప్ట్ వేర్ సేవలను అందిస్తోంది.

రిమోట్ వర్కింగ్

లాక్​డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా రిమోట్ పద్ధతిలో పని చేయవచ్చని తెలిసింది. చాలా మంది ఔత్సాహికులు ఖర్చు ఎక్కువ వచ్చే అంకురాల హబ్​లను విడిచి వెళ్లటం చూశాం. వారంతా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఖర్చును తగ్గించుకున్నారు.

ఖర్చు తగ్గించటం సహా వర్క్ ఫ్రం హోం వల్ల ఉత్పాదకత పెరిగింది. ప్రయాణంతో పాటు పనియేతర కార్యకలాపాలపై తక్కువ సమయం వెచ్చించటం వల్ల ఇది సాధ్యమైంది.

ఏ నగరం నుంచైనా ఉద్యోగులను తీసుకునేందుకు, వారితో అక్కడి నుంచే పని చేయించుకునేందుకు వీలు కల్పించింది. దీనివల్ల కంపెనీలు నిపుణులైన ఎక్కువ మందిని తీసుకునేందుకు అవకాశం లభించింది. కొన్ని సార్లు అలాంటి వాళ్లు తక్కువ ఖర్చుతో దొరకటం కూడా సాధ్యమయ్యేది.

ఉద్యోగులకు సంబంధించి అంకురాల్లో ఉన్న మోడల్​ను పెద్ద కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఇది దేశంలో ఉద్యోగాలకు సంబంధించిన వాతావరణాన్ని మరింత మెరుగ్గా మార్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్​ఫోన్ బ్రాండ్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.