ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన కరోనా టీకా 'జైకోవ్-డీ' మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా 30,000 మంది వలంటీర్లపై క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జైడస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే జరిపిన తొలి రెండు దశల క్లినికల్ పరీక్షల్లో తమ టీకా మెరుగైన ఫలితాలు సాధించిందని పేర్కొంది. ఆరోగ్యవంతులైన 1000 మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించారు.
ఇదీ చదవండి: టీకా అనుమతులు వచ్చేశాయ్.. పంపిణీ ఎలా?
మొదటి, రెండో దశల్లో డోసులు ఇచ్చిన అనంతరం వలంటీర్లలో తలెత్తిన ఆరోగ్య సమస్యలను పరిశీలించినట్టు సంస్థ వివరించింది. స్వతంత్ర సమాచార భద్రత బోర్డు పర్యవేక్షణలో ఫలితాలను సమీక్షించామని.. వీటిని ఎప్పటికప్పుడు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు తెలిపామని ఒక ప్రకటనలో వివరించింది.
''టీకా అభివృద్ధిలో అత్యంత కీలక దశకు చేరుకున్నాం. మా కార్యక్రమంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. కరోనాపై పోరులో దేశీయంగా తయారైన అత్యంత సమర్థమైన వ్యాక్సిన్‌ను అందించేందుకు మా వంతు పాత్ర పోషిస్తున్నాం.''
-పంకజ్ ఆర్ పటేల్, జైడస్ గ్రూపు ఛైర్మన్.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ టీకా పనితీరును, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు తోడ్పడతాయని జైడస్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్‌లు అభివృద్ధి చేసిన టీకాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.
ఇదీ చదవండి: ఆక్స్ఫర్డ్ టీకా 'కొవిషీల్డ్' ప్రత్యేకతలివే..
ఇదీ చదవండి: కొవిడ్ టీకాతో ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..
ఇదీ చదవండి: టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...