ETV Bharat / business

కరోనా దెబ్బ: జొమాటోలో జీతాలు కట్​.. ఉద్యోగాలు ఫట్​! - business news updates

కరోనా సంక్షోభం కారణంగా ఫుడ్​ డెలివరీ సంస్థల్లోనూ ఉద్యోగాలు పోతున్నాయి. 13 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది జొమాటో. మిగతా ఉద్యోగుల జీతాల్లో 50 శాతం వరకూ కోత విధించనున్నట్లు స్పష్టం చేసింది.

Zomato lays off 13% workforce
కరోనా దెబ్బకు జొమాటో ఉద్యోగాల్లో కోత
author img

By

Published : May 16, 2020, 6:01 AM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఈ సంక్షోభంలో నష్టాలు ఎదుర్కొంటున్న కారణంగా 13 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలిపింది ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో. మిగతా సిబ్బంది వేతనాల్లోనూ 50 శాతం వరకూ కోతలు తప్పవని వెల్లడించింది.

కరోనా సంక్షోభం కారణంగా ఊహించని నష్టాలను చవిచూస్తున్నట్లు చెప్పారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్​.

" మహమ్మారి కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాబోయే కాలంలో 600 మంది సిబ్బందిని తగ్గించుకుంటాం. సీనియర్​ ఉద్యోగుల జీతాల్లోనూ 50 శాతం వరకూ కోత విధిస్తాం. సంస్థపై భారం తగ్గించుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం" అని దీపిందర్​ స్పష్టం చేశారు.

గత రెండు నెలల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు గోయల్​. పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయన్నారు. ఇప్పుడు వస్తున్న మార్పులు శాశ్వతంగా ఉంటాయని వివరించారు. ఉద్యోగులను తొలిగించిన విషయం వారికి జూమ్​ వీడియో కాల్ ద్వారా తెలియజేస్తామని, ఇతర సంస్థల్లో అవకాశాలు వచ్చేలా చూస్తామని చెప్పారు.

సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా వ్యయాన్ని తగ్గించుకోనున్నట్లు.. మార్చిలోనే సూచన ప్రాయంగా తెలిపారు గోయల్. అనంతరం వందలాది మంది జొమాటో ఉద్యోగులు స్వచ్ఛందంగా వేతనాలు తగ్గించుకున్నారు. రాబోయే 6 నుంచి 12 నెలల్లో 25 నుంచి 40 శాతం రెస్టారెంట్లు మూతపడే అవకాశాలున్నాయాని గోయల్ చెప్పారు. జొమాటోకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా కార్యాలయాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.