ETV Bharat / business

ఈ ఫోన్ కొంటే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ - యూట్యూబ్

Youtube Premium: యూట్యూబ్​లో ఆసక్తికరంగా ఏదైనా వీడియో చూసేటప్పుడు మధ్యలో యాడ్​లు వస్తుంటే​ చిరాకు కలుగుతుంది! వాటిని తప్పించుకోవడం సహా వీడియోలు డౌన్​లోడ్ చేసుకోవడానికి​.. ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే యూట్యూబ్​ ప్రీమియం సేవలు ఉచితంగా అందిస్తోంది ఓ స్మార్ట్​ఫోన్​ సంస్థ. అది ఎలాగంటే?

youtube premium
youtube premium free
author img

By

Published : Mar 5, 2022, 12:48 PM IST

Youtube Premium: భారత్​లో వినియోగదారులకు 2 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సేవలు​ ఉచితంగా లభించనున్నాయి. సరికొత్త పోకో ఎం4 ప్రో కొనుగోలుతో ఈ ఆఫర్​ లభించనుంది. అందుకోసం యూట్యూబ్​, పోకో సంస్థలు జట్టు కట్టాయి. మొదటి 2 నెలల తర్వాత మూడో నెల నుంచి వినియోగదారులు చందా (సబ్​స్క్రిప్షన్​) చెల్లించాల్సి ఉంటుంది.

యూట్యూబ్​ ప్రీమియం వల్ల లాభం?

  • అసహనం కలిగించే యాడ్​లు లేకుండానే వీడియోలను వీక్షించవచ్చు
  • యూట్యూబ్​ అప్లికేషన్​ నుంచి బయటకు వచ్చినా.. వీడియోలు, మ్యూజిక్​ బ్యాక్​గ్రౌండ్​లో ప్లే అవుతాయి
  • వీడియోలను డౌన్​లోడ్​ చేసుకునే సదుపాయం
  • సబ్​స్క్రిప్షన్​తో యూట్యూబ్​ మ్యూజిక్ ప్రీమియం సేవలు ఆస్వాదించవచ్చు
  • ప్రీమియంలోని ప్రత్యేకమైన కంటెంట్​ను సబ్​స్క్రిప్షన్​తో వీక్షించవచ్చు

యూట్యూబ్​ ప్రీమియంను కొనుగోలు (టాప్​అప్​) చేయాలంటే ఇవీ ధరలు..

  • నెలకు- రూ.139
  • మూడు నెలలకు- రూ. 399
  • ఏడాదికి రూ.1290

ఇప్పటివరకు యూట్యూబ్​ ప్రీమియం వినియోగించనివారికి నెల రోజులపాటు ఉచితంగా (ఫ్రీ ట్రైయల్) ఆ సేవలను అందిస్తోంది యూట్యూబ్​. ఆ తర్వాత సబ్​స్క్రిప్షన్​కు (క్రెడిట్​కార్డు వంటి వాటి ద్వారా నెలనెలా ఆటోమేటిక్​గా చెల్లింపు జరిగిపోతుంది) ప్రతి నెల రూ.129 చెల్లించాల్సి ఉంటుంది.

పోకో ఎం4 ఫీచర్స్​ ఇవే..

  • మీడియా టెక్​ హీలియో జీ96 ఎస్​ఓసీ ప్రాసెసర్​
  • 8జీబీ ర్యామ్
  • 128జీబీ ఇంటర్నల్​ స్టోరేజీ
  • 6.43 అంగుళాల ఫుల్​ హెచ్​డీ+ అమోల్డ్​ డిస్​ప్లే
  • 90హెర్జ్​ రిఫ్రెష్​ రేట్
  • 64ఎంపీ ప్రైమరీ కెమెరా
  • 16ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర (భారత్​లో)..

  • 6జీబీ+64జీబీ.. రూ.13,999
  • 6జీబీ+128జీబీ.. రూ.15,499
  • 8జీబీ+128జీబీ.. రూ.16,999

ఇదీ చూడండి: ఆన్‌లైన్‌ వీడియోలను ఎలా డౌన్​లోడ్​ చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.