ETV Bharat / business

ఫేస్​బుక్​ను నిషేధించినా.. మీ సమాచారం సేఫ్! - ఫేస్​బుక్​పై నిషేధం

ఫేస్​బుక్​ సహా ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లను కేంద్రం నిషేధిస్తుంది అనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిల్లోని సమాచారం కోల్పోతామనే ఆందోళన చాలామందిలో నెలకొంది. అయితే ఫేస్​బుక్​ వినియోగదారులు అందులోని తమ సమాచారాన్ని ఒక ఆర్కైవ్ ఫైల్​ రూపంలో భద్రపరుచుకునే వీలుంది.

data on facebook can be stored
ఫేస్​బుక్​పై నిషేధం
author img

By

Published : May 25, 2021, 10:49 PM IST

ఫేస్​బుక్​, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై సదరు యాజమాన్యాలు ఇప్పటివరకూ స్పందించకపోవటం ఈ చర్చకు తెరలేపగా.. కేంద్రం చెప్పిన గడువు తేదీ ముగుస్తుండటం వల్ల ఇవి నిషేధిత యాప్​ల జాబితాలోకి వెళ్లిపోతాయా అనే డైలమా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాప్ లను ఎక్కువగా వినియోగించే వారిలో తెలియని ఆందోళన నెలకొంది. ఫేస్​బుక్​, ట్విట్టర్​ల సేవలు 2006లో ప్రారంభం కాగా.. ఇన్​స్టాగ్రామ్ 2010 నుంచి సేవలు అందిస్తోంది. ప్రత్యేకించి ఫేస్​బుక్​ను కేవలం భారత్ లోనే 29 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్దసంఖ్యలో ఫేస్​బుక్​ను వినియోగిస్తున్న దేశాలలో మనది అగ్రస్థానం.

ఇంతమందితో అనుబంధాన్ని పెనవేసుకున్న ఫేస్​బుక్​.. ఒక వేళ నిషేధానికి గురైతే ఎలా అన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. ప్రత్యేకించి ఫేస్​బుక్ వేదికగా.. కథలు, కవితలు, రచనలు, విశ్లేషణలు, అభిప్రాయాలను పంచుకునే చాలా మంది సంవత్సరాల తరబడి తాము రాసుకున్న సమాచారాన్ని కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. కొంతమంది పెన్ డ్రైవ్ ల్లో తమ విలువైన డేటాను నిక్షిప్తం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫేస్​బుక్​ వినియోగదారుల సమాచారం మొత్తం ఏదైనా ఒక ఆర్కైవ్ ఫైల్ రూపంలో దాచుకునే అవకాశాన్ని ఎప్పుడో కల్పించింది. ఫేస్​బుక్​ వాడే వినియోగదారులు.. కొంత కాలం పాటు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా.. ఈ ప్లాట్ ఫాం ను వదిలేయాలని భావించినా వారికి ఉపయుక్తమయ్యేలా కల్పించిన ఈ ఆప్షన్ ప్రస్తుతం మోస్ట్ సెర్చింగ్ జాబితాలో ఉంది.

ఫేస్​బుక్​ కల్పించిన సౌలభ్యం ప్రకారం ఫేస్​బుక్​లో మన డేటాను ఆర్కైవ్ ఫైల్ రూపంలో సేవ్ చేసుకోవటానికి ఈ పద్ధతిని అనుసరిస్తే సరి..

  • Facebook.com/settings ఫేస్​బుక్​లో సెట్టింగ్స్ ఆప్షన్ ను ఎంచుకోండి
  • "Download a copy of your Facebook data." అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • "Download Archive" ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • ఆర్కైవ్ డౌన్ లోడ్ క్లిక్ చేసిన తర్వాత డేటా మొత్తం డౌన్​లోడ్ కావటానికి కొంత సమయం పడుతుంది. పూర్తైన తర్వాత ఫేస్​బుక్​ నుంచి ఓ నోటిఫికేషన్ వస్తుంది
  • నోటిఫికేషన్ వచ్చిన తర్వాత "Download Archive" మీద మళ్లీ క్లిక్ చేస్తే, ఓ జిప్ ఫైల్ మన మొబైల్ లేదా పీసీలో డౌన్​లోడ్ అవుతుంది
  • ఆ ఫైల్​లో ఫోల్డర్ల రూపంలో సేవ్ అయ్యే మన డేటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు.. లేదా ఎక్కడికైనా ఈ ఫైల్ మూవ్ చేసుకోవచ్చు.

ఫేస్​బుక్​ బ్యాన్ అయినా కాకపోయినా ఎఫ్​బీ ప్రపంచంలో మనం గడిపిన కాలానికి చెరగని గుర్తుగా మీ ఫైళ్లన్నీ ఈ జిప్ ఫోల్డర్ లో భద్రంగా ఉంటాయి..!

ఇదీ చూడండి: కొత్త ఐటీ రూల్స్ అమలుకు ఫేస్​బుక్ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.