ETV Bharat / business

కుర్రకారు హు'షేర్‌'.. స్టాక్‌మార్కెట్లోకి యువతరంగం - డీమాట్ ఖాతా

దేశీయ స్టాక్​మార్కెట్లోకి యువత అడుగులు వేస్తోంది. మార్చి ఏప్రిల్​ నెలల్లో కొత్తగా 12 లక్షల డీమాట్ ఖాతాలు తెరచుకోవడం ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్‌ సంక్షోభం, ‘లాక్‌డౌన్‌’ విధింపు, సడలింపులు, ఇంటి నుంచే పని పరిస్థితుల వల్ల స్టాక్‌ మార్కెట్లోకి కొత్త మదుపరులు... ముఖ్యంగా యువకులు అధికంగా వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Young people coming heavily into the stock market
హు'షేర్‌'... స్టాక్‌మార్కెట్లోకి యువతరంగాలు
author img

By

Published : Jul 19, 2020, 7:29 AM IST

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లేవు, పోటీ పరీక్షలు లేవు... ఇదీ చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుల పరిస్థితి. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆన్‌లైన్లో షేర్లు కొని, అమ్ముకుంటే లాభం వస్తుందేమో... ఇది కొందరి ఆలోచన. ట్రేడింగ్‌ ఖాతా, డీమ్యాట్‌ ఖాతా ఆన్‌లైన్లోనే తెరిచి వెంటనే ట్రేడింగ్‌ మొదలుపెట్టవచ్చు. ఈ వెసులుబాటు యువతను స్టాక్‌ మార్కెట్‌ వైపు ఆకర్షిస్తోంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లోకి కొత్త మదుపరులు వస్తున్నారు. ఇందులో యువతరం అధికంగా కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా పెరుగుతున్న వర్తక పరిమాణం, కొత్త ఖాతాల సంఖ్య... ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యువత ఎందరో ఎంతో కొంత సొమ్ముతో స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించడం ఇటీవలి కాలంలో పెరిగింది. గత నాలుగు నెలల్లో పెద్ద సంఖ్యలో ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలు 'ఓపెన్‌' అయ్యాయి. ట్రేడింగ్‌ పరిమాణం (వాల్యూమ్స్‌) కూడా పెరగటం ఆసక్తికరమైన విషయం.

కరోనా వైరస్‌ విస్తరించటం, ఫలితంగా దేశవ్యాప్తంగా 'లాక్‌డౌన్‌' విధించటం, సడలించినా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో బయటతిరగటం సాధ్యం కావటం లేదు. దీనివల్ల స్టాక్‌ మార్కెట్లోకి కొత్త మదుపరులు, ముఖ్యంగా యువకులు అధికంగా వస్తున్నట్లు భావిస్తున్నారు.

Young people coming heavily into the stock market
డీమాట్ ఖాతా అందించే సంస్థలు

గతంలో ఇలా

డీమ్యాట్‌ ఖాతా, ట్రేడింగ్‌ ఖాతా తెరవాలంటే స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థను సంప్రదించి పాస్‌పోర్ట్‌ ఫొటోలు, కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) పత్రాలతో పాటు దాదాపు 15- 20 పేజీలు ఉండే దరఖాస్తును సమర్పించాల్సి వచ్చేది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు గానీ ఖాతా సిద్ధమయ్యేది కాదు. ఇప్పుడలా కాదు, ఆన్‌లైన్లో వెంటనే ఖాతా తెరిచి ట్రేడింగ్‌ చేయవచ్చు.

జెరోధాలో..

  • రెండు నెలల్లో సంస్థకు లభించిన కొత్త ఖాతాలు: 3 లక్షలు
  • వీరిలో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టినవారు 65 శాతం
  • వీరి వయసు 30 ఏళ్ల లోపే
  • ఆధారం: జెరోధా సీఈఓ నితిన్‌ కామత్‌

    మార్చి, ఏప్రిల్​లో 12 లక్షల డీమాట్ ఖాతా తెరచిన యువత

5 పైసా.కామ్‌లో

  • మార్చిలో 60 వేల కొత్త ఖాతాలు వచ్చాయి.
  • ఇందులో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన వారు 80 శాతం

ప్రస్తుతం ఇలా

జెరోధా, 5పైసా, అప్‌స్టాక్స్‌... వంటి టెక్నాలజీ ఆధారిత డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సంస్థల ప్రవేశంతో తక్కువ ఖర్చులో ఖాతా తెరవటం, ట్రేడింగ్‌ చేయటం సులువైంది.

  • సంప్రదాయ బ్రోకింగ్‌ సంస్థలైన మోతీలాల్‌ ఓస్వాల్‌, షేర్‌ఖాన్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ... ఎప్పటి నుంచో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సదుపాయాన్ని ఇస్తున్నాయి. ఏ షేర్లు కొనాలనే సలహాలూ ఈ సంస్థలు ఇస్తాయి. వీటిలో లావాదేవీలు నిర్వహించే మదుపరుల సంఖ్య కూడా పెరుగుతోంది.

కుప్పకూలి.... కోలుకుంటోంది

ఈ ఏడాది జనవరి వరకూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి పతనం మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 23 మధ్యకాలంలో సెన్సెక్స్‌, నిఫ్టీ 37 శాతం పతనం అయ్యాయి. ఆ తర్వాత కోలుకుంటున్న విషయం విదితమే. స్టాక్‌ మార్కెట్‌ పతనంలో అగ్రశ్రేణి కంపెనీల షేర్ల ధరలు బాగా పడిపోయి పెట్టుబడికి ఆకర్షణీయంగా మారాయి. దీంతో కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన మదుపరులకు మంచి పెట్టుబడి అవకాశాలు లభించాయి.

పెరుగుతున్న ఇంటర్నెట్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌

కొత్తతరం మదుపరులు, ముఖ్యంగా యువకులు ఆన్‌లైన్లోనే స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అందుకే ఇంటర్నెట్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ బాగా పెరుగుతున్నాయి. 'లాక్‌డౌన్‌' అమల్లో ఉన్న ఏప్రిల్‌ నెలలో ఎన్‌ఎస్‌ఈలో ఇంటర్నెట్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ 53 శాతం పెరిగింది. రోజువారీ సగటు టర్నోవర్‌ రూ.8,261 కోట్లు ఉండేది. ఏప్రిల్‌ నెలలో ఇది రూ.12,602 కోట్లకు పెరిగింది.

ఇంట్లో ఎక్కువ సమయం...

దాదాపు గత నాలుగు నెలలుగా ఎంతో మంది ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఎటూ కంప్యూటర్‌ ముందే ఉంటారు కాబట్టి, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఖాతా ఉంటే అప్పుడప్పుడూ ఏదో ఒక షేర్‌ కొని, లాభం వస్తే వెంటనే అమ్ముకోవచ్చు. ఆ ఉద్దేశంతో కొత్తగా ఖాతా తెరిచిన వారు ఎందరో కనిపిస్తున్నారు. ఇక సొంత వ్యాపారాలు చేసుకునే వారు, కన్సల్టెంట్లు, ఏజెంట్లు కూడా కొత్తగా స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్నారు.

తస్మాత్‌ జాగ్రత్త...

అప్రమత్తంగా లేకపోతే కొత్తగా స్టాక్‌ మార్కెట్లోకి వచ్చిన వారికి నష్టాల భయమూ అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల నిపుణుల సలహా తీసుకోవటం, జాగ్రత్తగా వ్యవహరించటం తప్పనిసరని చెబుతున్నారు. స్వల్పకాలిక లాభాల కోసం ఆశపడితే ఒక్కోసారి పెద్దఎత్తున నష్టాల బారిన పడొచ్చు. దశల వారీగా పెట్టుబడులు పెట్టి, సగటు రాబడులతో సంతృప్తి చెందటం మేలని నిపుణులు వివరిస్తున్నారు.

ఇదీ చూడండి: ఐఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ అదిరే ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.