ETV Bharat / business

తగిన ఆదాయం లేకున్నా.. ఐటీఆర్​ దాఖలు మంచిదే! - ఆదాయ పన్ను తాజా

రూ.2.5 లక్షల లోపు ఆదాయం దాటని వారు ఇన్​కం ట్యాక్స్ రిటర్న్​ (ఐటీఆర్​) దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపు ఉన్నా.. ఐటీఆర్​ దాఖలు చేయడం మంచిదే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న వారికి (ఇతరులకు కూడా) దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయంటున్నారు. మరి అవేమిటో చూద్దామా..

IT Returns
ఐటీ రిటర్న్స్
author img

By

Published : Jul 16, 2021, 8:39 PM IST

ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి పే స్లిప్​, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీకరణలుగా ఉపయోగపడతాయి. మరి, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే.. అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కి పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం ఆసన్నమైన నేపథ్యంలో.. పన్ను వర్తించే ఆదాయం లేని వారూ వీటిని సమర్పించడం వల్ల ఉన్న లాభాలేమిటో చూద్దాం..

ఆదాయ ధ్రువీకరణగా

ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు లేని వారందరూ సొంతంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునేందుకు వీలుంటుంది. తామే సొంతంగా తమ ఆదాయాన్ని తెలియజేసి, ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఒక వ్యక్తికి ఎంత ఆదాయం ఉంది.. అతని పొదుపు, పెట్టుబడులు, ఖర్చుల గురించిన పూర్తి వివరాలను ఈ రిటర్నులు తెలియజేస్తాయి.

రిఫండ్‌ రావచ్చు

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర పెట్టుబడి పథకాలపై వచ్చిన రాబడులకు పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు రిటర్నులు దాఖలు చేయడం ఒక్కటే మార్గం. మీకు పన్ను వర్తించే ఆదాయం లేనప్పుడు.. మీ నుంచి వసూలు చేసిన మొత్తం పన్నును రిఫండ్‌ రూపంలో రాబట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.2,50,000 మించి ఉన్నప్పుడూ.. కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను వర్తించే ఆదాయం తగ్గిపోతుంది. ఉదాహరణకు పిల్లల ట్యూషన్‌ ఫీజులు, బీమా పాలసీలు ఉన్నప్పుడు వాటిని సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవచ్చు.

రుణాలు తేలిగ్గా

సాధారణంగా రుణ దరఖాస్తు సమయంలో బ్యాంకులు కనీసం మూడేళ్ల ఐటీ రిటర్నులు అడుగుతుంటాయి. మీ దగ్గర ఇవి ఉంటే.. మీకు రుణం వచ్చే అవకాశాలు ఎంతో మెరుగవుతాయి. మీరు త్వరలో కారు లేదా ఇల్లు కొనాలని అనుకుంటే.. లేదా వ్యక్తిగత రుణం కోసం చూస్తుంటే.. ఐటీఆర్‌ మీకు ఎంతో కీలకంగా మారుతుందని మర్చిపోకండి. క్రెడిట్‌ కార్డులు, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకునేందుకూ రిటర్నులు అవసరమే.

నష్టాల సర్దుబాటు కోసం

నిర్ణీత గడవులోపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి మూలధన నష్టాలను భవిష్యత్‌లో వచ్చే మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల లాంటివి నష్టాలకు విక్రయించినప్పుడు ఆ తర్వాత వచ్చే లాభాలతో వీటిని సర్దుబాటు చేసి, పన్ను భారం తగ్గించుకోవచ్చు.

వీసా కోసం

వీసా ఇచ్చేందుకు కొన్ని దేశాలు ఆదాయపు పన్ను రిటర్నులు కోరుతున్నాయి. మీ ఆదాయ, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు.. దేశంలో పన్ను నిబంధనలు పాటిస్తున్న వ్యక్తిగానూ మిమ్మల్ని గుర్తిస్తాయి. పన్ను వర్తించే ఆదాయం లేదన్న కారణంతో రిటర్నులకు దూరంగా ఉండకండి. ఎంత ఆదాయం ఉన్నా.. నిజాయతీగా పన్ను రిటర్నులు దాఖలు చేయండి.

ఇదీ చదవండి: మరింత సులభంగా ఐటీ రిటర్నులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.