పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించేందుకు చాలా దేశాలు విద్యుత్ వాహనాల(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నాయి. అందుకే తమ పౌరులను ఈవీల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంధనంతో నడిచే వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రాన్స్‌కు చెందిన వాహన తయారీ సంస్థ 'సిట్రో యెన్' పరిమాణంలో చిన్నది, చౌకైనది అయిన 'అమి' అనే విద్యుత్ కారును రూపొందించింది.
లైసెన్స్ అవసరమే లేదు
ఈ చిన్న విద్యుత్ కారు (అమి) వాస్తవానికి నగర ప్రయాణం కోసం తయారు చేసిన ఫాన్సీ రూఫ్డ్ స్కూటర్లాగా ఉంటుంది. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఫ్రాన్స్‌లో ఈ వాహనం నడపడానికి కావాల్సిన కనీస వయస్సు 14 ఏళ్లు. మిగతా ఐరోపా దేశాల్లో అయితే 16 ఏళ్లు.
గంటకు 45కి.మీ వేగంతో...
ఈ ఎలక్ట్రిక్ కారులో 5.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఏదైనా 220వి పవర్ అవుట్లెట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటల సమయం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జింగ్ అయిన ఈ వాహనంతో 70 కి.మీ (44 మైళ్లు) వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ లాంటి కారు గంటకు 45 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
-
The day has come: Citroën introduces AMI 100% ËLECTRIC and makes electric urban mobility available to all!#CitroënAmi #ËlectricForAll #InspirëdByYouAll pic.twitter.com/LuqSAl4vcB
— Citroën India (@CitroenIndia) February 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The day has come: Citroën introduces AMI 100% ËLECTRIC and makes electric urban mobility available to all!#CitroënAmi #ËlectricForAll #InspirëdByYouAll pic.twitter.com/LuqSAl4vcB
— Citroën India (@CitroenIndia) February 28, 2020The day has come: Citroën introduces AMI 100% ËLECTRIC and makes electric urban mobility available to all!#CitroënAmi #ËlectricForAll #InspirëdByYouAll pic.twitter.com/LuqSAl4vcB
— Citroën India (@CitroenIndia) February 28, 2020
నగరాల్లో ప్రయాణానికే..
ఈ చిన్న కారు నగరాల్లోని గజిబిజి రోడ్లలో, ఇరుకైన సందుల్లో సులభంగా వెళ్లడానికి ఉపయోగపడుతుంది. దీని పైకప్పు పారదర్శకంగా ఉంటుంది. కారు సైడ్ విండోస్ మాన్యువల్‌గా టిల్ట్ చేయడం ద్వారా తెరచుకుంటాయి.
ధర ఎంతంటే?
సిట్రో యెన్ 'అమి' ధర 6,590 డాలర్లుగా ఉంది. ఒకే సారి ఇంత పెద్ద మొత్తం చెల్లించలేని వినియోగదారులు... డౌన్ పేమెంట్ కింద 2,900 డాలర్లు చెల్లించి వాహనాన్ని తీసుకోవచ్చు. అప్పటి నుంచి ప్రతి నెలా 22 డాలర్లు చొప్పున రెండేళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది.
అద్దెకు కూడా...
ఈ కారును కొనలేని వారికి కూడా కంపెనీ ఓ మంచి అవకాశాన్ని అందిస్తోంది. యూరోపియన్ కార్-షేరింగ్ సర్వీస్, ఫ్రీ2మూవ్ ద్వారా దీనిని అద్దెకు ఇస్తోంది. నిమిషానికి 29 సెంట్లు చొప్పున చెల్లించి ఈ వాహనాన్ని హాయిగా డ్రైవ్ చేయెచ్చు.
మార్చి 30 నుంచే..
సిట్రో యెన్ 2020 మార్చి 30 నుంచి కేవలం ఫ్రాన్స్‌లోనే ఈ కారు ఆర్డర్లు తీసుకోనుంది. పోర్చుగల్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, జర్మనీ లాంటి ఇతర ఐరోపా దేశాల్లో మరికొద్ది నెలల్లో ఈ కారు అమ్మకాలు ప్రారంభించనుంది.
ఇదీ చూడండి: ఫేస్బుక్లో ఆ ప్రకటనలు బంద్.. అంతా కరోనా మాయ