ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​ నుంచి 'ఎస్​ బ్యాంక్'​ తొలగింపు! - నిఫ్టీ

నిఫ్టీలోని అన్ని సూచీల నుంచి ఎస్​ బ్యాంక్​ను తొలగించనున్నారు. ఈనెల 19న ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Yes Bank to be excluded from Nifty 50, Nifty bank from Mar 19... Yes Bank shares bounce back, zoom over 58 pc
స్టాక్​ మార్కెట్​ నుంచి 'ఎస్​ బ్యాంక్'​ తొలగింపు!
author img

By

Published : Mar 16, 2020, 1:04 PM IST

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంకును మార్చి 19నుంచి ఇండెక్స్​ నిఫ్టీ 50, బ్యాంకింగ్​ ఇండెక్స్​ నిఫ్టీ బ్యాంకు తదితర నిఫ్టీ సూచీల నుంచి తొలగించనున్నారు. ఎన్​ఎస్​ఈ ఇండిసెస్ ఈ విషయం వెల్లడించింది. మార్చి 27న ఈ మార్పులు జరగనున్నట్లు గతంలో ప్రకటించగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకానికి సంబంధించి ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల దృష్ట్యా.. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంకుల నుంచి ఎస్​ బ్యాంకును తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఇండెక్స్​ మెయింటెనెన్స్​ సబ్​- కమిటీ(ఐఎస్​ఎస్​సీ) నిర్ణయించింది. వీటితో పాటు నిఫ్టీ 100, నిఫ్టీ 500 నుంచి కూడా ఎస్​ బ్యాంకును తొలగించనున్నారు.

నిఫ్టీ 100లో ఎస్​ బ్యాంకు స్థానాన్ని అదానీ ట్రాన్స్​మిషన్​​ దక్కించుకుంటుంది. ఇక నిఫ్టీ 500లో స్టెర్లింగ్​, విల్సన్​ సోలార్​లు రానున్నాయి. నిఫ్టీ 50లో ఓ ప్రైవేట్​ రుణదాత స్థానాన్ని శ్రీ సిమెంటు సంస్థ భర్తీ చేయనుంది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్​లో బంధన్​ బ్యాంకు స్థానం పొందనుంది.

పుంజుకున్న బ్యాంకు షేర్లు...

ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకాన్ని శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో ఆ బ్యాంకు షేర్లు సోమవారం 58 శాతం పెరిగాయి. బీఎస్​ఈలో ఒకేసారి 58.12 శాతం మేర పుంజుకొని షేరు విలువ రూ.40.40లకు చేరుకుంది. ఇందులో 112.78 లక్షల షేర్లు ట్రేడ్​ కాగా.. ఎన్​ఎస్​ఈలో 9.55 కోట్ల షేర్లు చేతులు మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.