ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బ్యాంక్.. డీటీహెచ్ సేవల సంస్థ డిష్‌టీవీ ఇండియా లిమిటెడ్ నుంచి 44.53 కోట్ల ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకుంది. డిష్‌టీవీలో ఈ మొత్తం షేర్ల వాటా 24.19 శాతానికి సమానం. ఒక్కో షేరును నామమాత్రపు ధర రూ.1తో దక్కించుకుంది ఎస్ బ్యాంక్.
ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన కొన్ని సంస్థలు క్రెడిట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థలకు డిష్ టీవీలో ఉన్న వాటాలను ఎస్ బ్యాంకు ఒకేసారి స్వాధీనం చేసుకుంది.
డిష్‌టీవీ ఇండియా లిమిటెడ్
డిష్‌టీవీ... డైరెక్ట్ హోమ్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్ ప్రొవైడర్. ఈ కంపెనీ బ్యాండ్‌విడ్త్ సామర్థ్యం 1,422 ఎంహెచ్‌జెడ్. ఈ కంపెనీకి 40 ఆడియో ఛానళ్లు, 70 హెచ్డీ ఛానళ్లు సహా 655 ఛానళ్లు ఉన్నాయి.
డిష్‌టీవీ 2019 మార్చి 31 నాటికి రూ.6,218.28 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి డిష్‌టీవీ ఇండియాను జీ గ్రూప్, వీడియోకాన్ గ్రూప్‌లు నిర్వహిస్తున్నాయి.
ఇదీ చూడండి: మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్