జూన్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ఠానికి దిగొచ్చింది. చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ఠానికి చేరినా.... డబ్ల్యూపీఐ మాత్రం తగ్గుదల నమోదు చేసిందని కేంద్ర గణాంక విభాగం లెక్కలు వెల్లడించాయి.
కేంద్ర గణాంక విభాగం లెక్కల ప్రకారం..
ఆహార వస్తువులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల... జూన్ నెలలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.18 శాతానికి ఎగబాకింది. అదే సమయంలో కూరగాయలు, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గి... టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.02 శాతానికి దిగొచ్చింది.
కూరగాయల ధరల్లో.. టోకు ధరల ద్రవ్యోల్బణం 24.76 శాతానికి తగ్గగా..ఉల్లి ధరలు మాత్రం 16.63 శాతం పెరిగాయి.
ఇదే సమయంలో ఇంధన ధరలు 2.2 శాతం తగ్గాయి.
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2017 జులైలో 1.88 శాతం అత్యల్ప స్థాయికి తగ్గితే.. ఇప్పుడు 2.02 శాతంతో అదే స్థాయికి క్షీణించింది.
ఇదీ చూడండి: ఈ పథకంతో పన్ను ఆదా, పింఛను భరోసా!