ETV Bharat / business

'ఏటా 200 కోట్ల డోసుల తయారీకి సిద్ధం'

దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన వాక్‌హార్డ్‌ కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఏటా 200 కోట్ల టీకా డోసుల్ని తయారు చేయగల సామర్థ్యం తమకు ఉందని పేర్కొంది. అంతేగాక 2022 ఫిబ్రవరి నుంచి యాభై కోట్లతో ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపింది. కొవిడ్‌-19 టీకాల ఉత్పత్తికి కావాల్సిన సాంకేతికతను వాక్‌హార్డ్‌ సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించింది.

wockhardt pharma to make 200cr doses of vaccine for covid-19
వాక్‌హార్డ్‌
author img

By

Published : May 26, 2021, 2:21 PM IST

Updated : May 26, 2021, 2:34 PM IST

దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత వేధిస్తున్న సమయంలో దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన వాక్‌హార్డ్‌ కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఏటా 200 కోట్ల టీకా డోసుల్ని తయారు చేయగల సామర్థ్యం తమకు ఉందని పేర్కొంది. 2022 ఫిబ్రవరి నుంచి యాభై కోట్లతో ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వాక్‌హార్డ్‌ తెలియజేసినట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఏ కంపెనీల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలో గుర్తించి.. వాటితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంలో ప్రభుత్వ సహకారం కావాలని కోరింది.

ఇప్పటికే కొవిడ్‌-19 టీకాల ఉత్పత్తికి కావాల్సిన సాంకేతికతను వాక్‌హార్డ్‌ సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. ఎంఆర్‌ఎన్‌ఏ, ప్రోటీన్‌ ఆధారిత, వైరల్‌ వెక్టర్‌ ఆధారిత ఇలా పలు సాంకేతికతల ఆధారంగా రూపొందించిన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడమేగాక, అవసరమైన పరిశోధనలు చేపట్టడానికి కావాల్సిన సామర్థ్యం తమ సంస్థకు ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: టీకాలు ఇచ్చేందుకు ఫైజర్​ రెడీ.. కానీ!

ఇదీ చదవండి: 'మా టీకా పిల్లలపై పనిచేస్తోంది'

అయితే, ప్రస్తుతానికి కేవలం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కోసం మాత్రమే కరోనా టీకాల తయారీలో సహకరించేందుకు ఆ ప్రభుత్వంతో వాక్‌హార్డ్‌ ఒప్పందం కుదుర్చుకొంది. ప్రస్తుతం దక్షిణ వేల్స్‌లోని సంస్థ తయారీ కేంద్రం నుంచి ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వయల్స్‌లో నింపి, ప్యాక్‌ చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో వాక్‌హార్డ్‌ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆలోచనల్లో పడింది.

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి మన్సుక్‌ మాండవీయ మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఏదైనా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు వాక్‌హార్డ్‌ ముందుకు వచ్చిందని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఆలోచనలు జరపుతోందని.. ఏదైనా వ్యాక్సిన్‌ తయారీ సంస్థతో దానికి భాగస్వామ్యం కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి: టీకా తీసుకొని.. బ్లూషీల్డ్ పొందండి

'మహమ్మారిని ఓడించేందుకు టీకా ఒక్కటే మార్గం'

Last Updated : May 26, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.