ETV Bharat / business

లాక్​డౌన్ తర్వాత పెరిగిన వాహన విక్రయాలు- కారణమిదే

author img

By

Published : Oct 31, 2020, 5:55 PM IST

ప్రభుత్వం లాక్​డౌన్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల వ్యయం క్రమంగా పెరుగుతోంది. కరోనాకు ముందున్న స్థాయిలో ప్రస్తుతం విక్రయాలు పెరిగాయని ఫెడరల్ బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ శాలిని వారియర్ తెలిపారు. అయితే ఆ ఖర్చు వైరస్​ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే వస్తువులు, సేవలపై ఎక్కువగా చేస్తున్నారని స్పష్టం చేశారు.

car
కొనుగోళ్లు

కరోనా వచ్చిన కొత్తలో ప్రజలు ఖర్చు పెట్టే తీరు మారిపోయింది. ఆ సమయంలో కేవలం కిరాణా సరుకుల, మందులు లాంటి నిత్యావసరాలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేశారు. కొన్ని నెలల నుంచి లాక్​డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తుండటం వల్ల వినియోగదారు వ్యయం పెరుగుతోంది.

కరోనాను కట్టడి చేసేందుకు మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ప్రకటించారు. ఇది ప్రపంచంలోనే కఠినమైన లాక్​డౌన్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కొన్ని రంగాలు మినహా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఫలితంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ప్రజలు డబ్బులను పొదుపు చేసేందుకు మొగ్గుచూపారు. అందువల్ల కొనుగోలు తీరులో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో మార్పు అధికంగా కనిపించింది.

మూడు నెలల్లో వినియోగదారుల వ్యయం పెరిగిందని ఫెడరల్ బ్యాంకు కార్యనిర్వహక డైరెక్టర్ శాలిని వారియర్ తెలిపారు. ముంబయికి చెందిన ఈపీఎస్ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన శాలిని పలు విషయాలను పంచుకున్నారు. లాక్​డౌన్ తొలినాళ్లలో వినియోగదారుడు చేసే వ్యయం తగ్గినట్లు గుర్తించామని... వంట సరుకులు, మెడిసిన్, ఇతర అవసరాలపై పరిమితంగా ఖర్చు చేశారని స్పష్టం చేశారు.

"ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారుడి వ్యయం పెరుగుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డు సంబంధించిన వ్యయాన్ని జనవరితో పోల్చితే ప్రస్తుతం 80-90 శాతానికి చేరుకుంది. ఇది మార్కెట్ గమనానికి ఒక మంచి సూచిక. "

- శాలిని వారియర్, కార్యనిర్వహక డైరెక్టర్, ఫెడరల్ బ్యాంకు

కరోనాకు ముందున్న స్థాయికి వినియోగదారుడి వ్యయం వచ్చినప్పటికీ... ఖర్చు పెట్టే తీరు మారిపోయింది. ప్రయాణాలు, హోటళ్లు, హాస్పిటాలిటీ బాగా తగ్గిపోగా.. నిత్యవసరాలు, ఇతర గృహ వినియోగ వస్తువులకు గిరాకీ పెరిగింది.

వ్యక్తిగత వాహనాలకు గిరాకీ..

వినియోగదారుల వ్యయానికి సంబంధించిన సమాచారాన్ని బిగ్ డాటా ద్వారా విశ్లేషిస్తుంటాయి బ్యాంకులు. ఫెడరల్ బ్యాంకుకు సంబంధించి సమాచారాన్ని శాలిని వారియర్ పరిశీలిస్తుంటారు.

"చిన్న కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు మేము గమనించాం. ఈ విభాగంలో కొనుగోళ్లు పెరిగినట్లు గుర్తించాం. ప్రజా రవాణాలో ఉన్న రిస్కును ప్రజలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో వ్యక్తిగత వాహనాలు కొంటున్నారని భావిస్తున్నాం" అని శాలిని తెలిపారు.

బస్సులు, మెట్రో సేవలు నిలిచిపోవటం, ప్రజా రవాణా వ్యవస్థలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలు కొనే వారి సంఖ్య పెరుగుతోంది.

పండుగ సీజన్ ప్రభావం

అక్టోబర్​లో దసరాతో ప్రారంభమయ్యే పండుగ సీజన్.. వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనుంది. భారతీయులు పండుగల సమయంలో ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతుంటారు. కొత్త వాహనాలు, ఇళ్లు, బంగారం, ఆభరణాలు, బట్టలు తదితరాలు కొంటుంటారు. ప్రస్తుతం సీజన్​ నడుస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ-కామర్స్ వేదికగా దసరాకు ముందు ఏ స్థాయిలో విక్రయాలు జరిగాయో అందరం గమనించామని శాలిని అన్నారు.

రికవరీ..

పండుగ సీజన్​లో కొనుగోళ్లు పెరిగాయని, ఆర్థిక రికవరీకి ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్థిక మంత్రి... ఇటీవల డిమాండ్ పెరగటం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 24 శాతం పడిపోయిన జీడీపీని పెంచేందుకు అది ఉపయోగపడుతుందని అన్నారు.

లండన్​కు చెందిన ఐహెచ్ఎస్ మార్కిట్స్ సంస్థ ప్రచురించే 'పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్'(పీఎమ్ఐ) గణాంకాలు దేశ ఆర్థిక ఆరోగ్యానికి కీలకంగా పరిగణిస్తారు. ఇది 40 ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కంపెనీల ఉన్నత అధికారులను సర్వే చేసి పీఎమ్ఐని ప్రచురిస్తుంది. ఐహెచ్ఎస్ ప్రకారం సెప్టెంబర్​లో భారత పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి.. గత ఎనిమిది సంవత్సరాల గరిష్ఠాన్ని తాకింది.

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠీ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.