ETV Bharat / business

క్రూడ్‌ తగ్గింది... పెట్రో తగ్గదేం? - డీజిల్ ధరలు

కరోనా భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా చైనా నుంచి చమురు డిమాండ్ తగ్గిపోవడం కారణంగా ధరలు ఈ స్థాయిలో తగ్గుతున్నాయి. అయితే క్రూడ్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మాత్రం పెద్దగా తగ్గడం లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది.. విశ్లేషకులు ఏమంటున్నారు.

Why fuel prices are high despite a decline in crude prices?
క్రూడ్‌ తగ్గింది... పెట్రో తగ్గదేం?
author img

By

Published : Mar 1, 2020, 7:49 AM IST

Updated : Mar 3, 2020, 12:51 AM IST

అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది.. మన దగ్గర ధరలు ఎప్పుడు తగ్గుతాయి.. తగ్గిన ముడిచమురు ధరల ప్రభావం మనదేశంపై ఎలా ఉంటుందో చూద్దాం..

గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధర 20 శాతం పైగా తగ్గి, బ్యారెల్‌ 50 డాలర్లకు చేరింది. దేశీయంగా చూస్తే, ఆ స్థాయిలో పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గ లేదు. దిల్లీలో లీటరు పెట్రోలు రూ.71.89; డీజిల్‌ రూ.64.51గా ఉంది. అయితే 2017 సెప్టెంబరు-అక్టోబరులో బారెల్‌ ధర 54-56 మధ్య ఉన్నపుడు లీటరు పెట్రోలు ధర రూ.69-70 మధ్య డీజిల్‌ ధర రూ.57-58 మధ్య ఉంది. 2018-19 డిసెంబరు-జనవరిలోనూ ముడిచమురు ధరలు 57-59 డాలర్ల స్థాయిలో ఉన్నా, పెట్రోలు(రూ.71), డీజిల్‌(రూ.64) ధరలు తక్కువగానే ఉన్నాయి.

కారణం ఏమిటంటే..

వాస్తవానికి ప్రస్తుత స్థాయిల కంటే కనీసం లీటరు పెట్రో ధర రూ.3-5 వరకు ధర తక్కువగా ఉండాల్సిందని అంచనా వేస్తున్నారు. అయితే తమ నష్టాలు కొంతైనా తగ్గించుకోవడానికి కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో మరీ ఎక్కువగా ధరలను తగ్గించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కంపెనీలు అంటున్నాయి.

ఇదీ లెక్క..

గత ఏడాది కాలంలో రూపాయి రూ.68 నుంచి రూ.71కి పతనమైందని.. దీనిని లెక్కలోకి తీసుకుంటే రూ.1-2 మాత్రమే అధికంగా ఉండాలని, ప్రస్తుత ధరలు మాత్రం లీటరుకు రూ.3 వరకు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇతర రంగాలకూ కొంత ఊరట

తగ్గుతున్న ముడిచమురు ధరల కారంగా భారత ఆర్థిక వ్యవస్థకే కాకుండా.. విమానయానం, నౌకాయానం, రోడ్డు, రైల్వే రవాణా వంటి వాటికి కొంతైనా ప్రయోజనం దక్కనుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో చమురుకు గిరాకీ తగ్గడం.. భారత్‌ వంటి భారీ దిగుమతి దేశాలు ధరపై బేరం ఆడడానికి పనికొచ్చే అంశం. ఇప్పటికే అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఏఈఏ) అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో కోత వేసింది.

భారత విమానయాన సంస్థలకు ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. కొంత కాలంగా నష్టాల్లో ఉన్న ఇవి తాజా పరిణామాల వల్ల కొంతైనా నష్టాలను పూడ్చుకోవచ్చు. గతంలోనూ తగ్గిన చమురు ధరల వల్ల విమానయాన సంస్థల లాభదాయత మెరుగుపడింది. ఆర్థిక మందగమనంలోనూ భారత విమాన ప్రయాణికుల రద్దీలో 3.7 శాతం మేర వృద్ధి నమోదైంది.

ప్రభుత్వ ఖజానాకూ చమురు ధరలు చల్లారడం ఊరట కలిగిస్తుంది. ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే తడబడ్డ ప్రభుత్వం లక్ష్యాన్ని 3.5 శాతం నుంచి 3.8 శాతానికి(2019-20) పెంచుకుంది. అయితే చమురు ధరల క్షీణత వల్ల ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ కూడా అంటున్నారు. ఎలాగంటే.. పెట్రో ధరలు తగ్గితే రవాణా ధరలు తగ్గి.. ఆహార వస్తువుల ధరలూ అదుపులో ఉంటాయి. అపుడు ఆహార ద్రవ్యోల్బణంపై.. తద్వారా టోకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుంది. దేశీయంగా రవాణా, రాష్ట్రాల పన్నుల కారణంగా పెట్రోల్‌, డిజిల్‌ ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. పరిస్థితులు చక్కబడినా బ్యారెల్‌ ముడిచమురు ధర 60-70 బారెళ్ల పరిధిలోనే కదలాడవచ్చని విశ్లేషకులు నమ్ముతున్నారు.

ఇదీ చూడండి:ఇకపై అంతర్జాతీయ క్రికెటర్లతో మీరూ ఆడొచ్చు!

Last Updated : Mar 3, 2020, 12:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.