ETV Bharat / business

మీ కారు మిమ్మల్ని కాపాడే సూపర్‌ స్టారేనా? - భారత్​లో కార్ సేఫ్టీ ఎంత?

కారణమేదైనా కానీ.. కారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు సేఫ్టీ రేటింగ్స్​ని బట్టి కారు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌ గురించి తెలుసుకుందామా?

car safety test
కారు
author img

By

Published : Oct 18, 2021, 6:19 AM IST

బ్రేకులు బాగా పనిచేస్తే కారు సురక్షితం అనుకునే రోజులు పోయాయి.. మనం బ్రేకు వేసినా ఎదుటివారి కారు వచ్చి ఢీకొంటే ప్రమాదం తప్పదు. ఒక్క 2019లోనే 4.3 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 1.54లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది 18-45 మధ్య వయస్సు వారే. అందుకే.. ఏం జరిగినా.. మన వాహనం ఆ ప్రమాద తీవ్రత నుంచి ఎంత వరకు మనల్ని కాపాడుతుంది అనేది సేఫ్టీ రేటింగ్స్‌ చెబుతాయి. పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు కూడా ఇప్పుడిప్పుడే ఈ రేటింగ్స్‌ను గమనించడం మొదలు పెట్టారు. దీంతో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ (న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం) సంస్థ ఇచ్చే రేటింగ్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు భారత్‌లో తయారయ్యే కార్లకు చాలా తక్కువ రేటింగ్స్‌ వచ్చేవి. కానీ, ఇటీవలి కాలంలో కంపెనీలు భద్రతా ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చాయి. దీంతో భారత్‌ తయారీ కార్లు కూడా సురక్షితమైనవని నిరూపించుకొంటున్నాయి. అయితే భారత్‌లో టాప్‌టెన్‌లో అమ్ముడు పోయే వాహనాల్లో చాలా వరకూ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ టాప్‌ టెన్‌ జాబితాలో లేకపోవడం గమనార్హం.

గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్స్‌..

1979లో అమెరికాలో న్యూకార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను యూఎస్‌ నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ ప్రారంభించింది. ఆ తర్వాత కాలక్రమంలో దీనిని ఆధారంగా చేసుకొని ఐరోపా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కొరియా, జపాన్‌, భారత్‌(2017), లాటిన్‌ అమెరికా, దక్షిణాసియా ప్రాంతాల్లో ఎన్‌సీఏపీలను ప్రారంభించారు. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ యూకేలో స్వతంత్రంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని కార్లలో భద్రతా ప్రమాణాలను విశ్లేషించి మరింత మెరుగుపర్చేందుకు దీనిని 2011లో స్థాపించారు. ప్రమాద తీవ్రత పరీక్షల నిర్వహణ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల నియంత్రణ సంస్థల ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొంటుంది.

ఈ సంస్థ 0-5 స్టార్‌ రేటింగ్స్‌ను ఇస్తుంది. పెద్దలు, పిల్లలు కూర్చొనే సీట్లకు లభించే భద్రతను లెక్కగడుతుంది. తయారయ్యే అన్ని కార్లు ఐక్యరాజ్య సమితి క్రాష్‌ టెస్ట్‌ ప్రమాణాలను దాటేట్లు చూడటం, పాదచారులకు భద్రతను కల్పించేలా మార్పులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ను ప్రోత్సహించడం వంటివే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్లోబల్‌ ఎన్‌సీఏపీ వెబ్‌సైట్‌ పేర్కొంది. భారత్‌లో ఐరాస నిబంధనలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలను 2017లో తప్పని సరి చేశారు.

యూరో ఎన్‌సీఏపీతో పోలిస్తే గ్లోబల్‌ ఎన్‌సీఏపీ పరీక్షలు కొంత సరళంగా ఉంటాయి. దీనిలో కారును ఎదురుగా, పక్కల నుంచి ప్రమాదానికి గురిచేసి పరీక్షలు నిర్వహిస్తారు. సెన్సర్ల ఆధారంగా తల ఎంతగా గాయపడుతుందో అంచనావేస్తారు. అందుకోసం కారును గంటకు 64 కిలోమీటర్ల వేగంతో.. ఎదురుగా ఉన్న వస్తువుకు లేదా వాహనానికి ఢీకొనేట్లు చేస్తారు. ఈ పరీక్షల్లో శరీరంలోని కాళ్లు, తొడలు, ఛాతీ, మోకాళ్లు, తుంటి,మెడ వంటి కీలక భాగాలపై ప్రమాద ప్రభావాన్ని అంచనావేస్తారు. భవిష్యత్తులో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌ను యూరో ఎన్‌సీఏపీ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.

కంపెనీల జోక్యం లేకుండా పారదర్శకంగా..

ఈ పరీక్షలు విమర్శలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండేట్లు గ్లోబల్‌ ఎన్‌సీఏపీ జాగ్రత్త పడుతుంది. ఈ పరీక్షల సంబంధించి నిబంధనలు, వీడియోలు, ఫొటోలను కూడా బహిర్గతం చేస్తుంది. వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకే ఇవి ఉపయోగపడతాయి. ఓఈఎం (ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానిఫ్యాక్చరర్‌) నుంచి తమ వాహనం పరీక్షంచాలని విన్నపం వచ్చిన సందర్భంలోనూ.. లేదంటే కొన్ని సందర్భాల్లో గ్లోబల్‌ ఎన్‌సీఏపీనే స్వచ్ఛందంగానే కార్లను పరీక్షిస్తుంది.

కంపెనీలను నమ్మదు..

కంపెనీలు స్వచ్ఛందగా గ్లోబల్‌ ఎన్‌సీఏపీకి పరీక్షల నిమిత్తం ఇచ్చే కార్లను స్వీకరించదు. వీటిల్లో మోసపూరిత మార్పులు, పరీక్షల కోసం తయారు చేసే స్పెషల్‌ ఎడిషన్లను నివారించేందుకు ఇలా చేస్తుంది. పరీక్షించనున్న కారు అప్పటికే విక్రయిస్తుంటే డీలర్‌ నుంచి రహస్యంగా కొనుగోలు చేస్తుంది. మార్కెట్లోకి విడుదల కాని కారు అయితే.. ప్లాంట్‌కు తమ సిబ్బందిని పంపి కారును ఎంపిక చేస్తుంది.

పారదర్శకతను పెంచేందుకు కార్ల కంపెనీ ప్రతినిధి పరీక్షా సమయంలో అక్కడ ఉండేలా చూస్తుంది. అనంతరం శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి నివేదికను సిద్ధం చేస్తుంది. కంపెనీలతో సమావేశమై ఫలితాలను వెల్లడిస్తుంది. అనంతరం నివేదికలను బహిర్గతం చేస్తుంది. పరీక్షలకు అయిన ఖర్చుల బిల్లులను పూర్తి వివరాలతో సంస్థలకు పంపిస్తుంది.

భారత్‌లో కొన్ని కార్ల కంపెనీలకు గ్లోబల్‌ ఎన్‌సీఏపీ పరీక్షలపై అభ్యంతరాలు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కార్లు విక్రయించే ఓ సంస్థ తమ వాహనాలకు ఈ రేటింగ్స్‌ అవసరంలేదని పేర్కొంది. అలాంటి సందర్భాల్లో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ బహిరంగ మార్కెట్‌ నుంచి ఈ కార్లను రహస్యంగా కొనుగోలు చేసి పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఖర్చులు ఎవరు భరిస్తారనేది రహస్యంగా ఉంచుతుంది.

భారత్‌ విషయానికి వస్తే టాటా, మహీంద్రా సంస్థల వాహనాలు ఈ రేటింగ్స్‌ టాప్‌టెన్‌ జాబితాలో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. టాటాకు చెందిన ఐదు వాహనాలు, మహీంద్రావి మూడు ఉండగా.. ఫోక్స్‌వేగన్‌, మారుతీ వాహనాలు ఒక్కొక్కటి ఉన్నాయి.

టాటా పంచ్‌..

టాటా పంచ్‌ ఇటీవల ఈ పరీక్షలను పూర్తి చేసుకొంది. దీనికి అడల్ట్స్‌ ఆక్యూపెంట్‌ ప్రొటెక్షన్‌ విభాగంలో 5స్టార్‌ రేటింగ్‌ లభించింది. ఛైల్డ్‌ ఆక్యూపెంట్‌ ప్రొటెక్షన్‌లో 4స్టార్‌ రేటింగ్‌ వచ్చింది. భారత్‌లోనే అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. మొత్తం 17 పాయింట్లలో 16.45 పాయింట్లను ఈ కారు సాధించింది. పిల్లల రక్షణ విషయంలో 49 పాయింట్లకుగాను 40.89 పాయింట్లు సాధించింది.

tata punch
టాటా పంచ్

మహీంద్రా ఎక్స్‌యూవీ300

మహీంద్రా ఎక్స్‌యూవీ కూడా పెద్దల రక్షణ విభాగంలో 5స్టార్‌ రేటింగ్‌, పిల్లల రక్షణకు సంబంధించి 4 స్టార్‌ రేటింగ్‌ను పొంది.. మొత్తం 16.42 పాయింట్లను స్కోర్‌ చేసింది. పిల్లల రక్షణకు సంబంధించి మొత్తం 49 పాయింట్లలో ఈ కారుకు 37.44 లభించాయి.

xuv300
xuv300

టాటా అల్ట్రోజ్‌..

భారత్‌లో విక్రయించే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ ప్రకారం అత్యంత సురక్షితమైన కారు ఇది. దీనికి పెద్దల రక్షణ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌.. పిల్లల రక్షణ విభాగంలో 3 స్టార్‌ రేటింగ్‌ లభించింది.

altroz
అల్ట్రోజ్

టాటా నెక్సన్‌..

భారత్‌లో తయారై తొలిసారి 5స్టార్‌ రేటింగ్‌ అందుకొన్న కారు ఇదే. దీనికి 2018లో ఈ ఘనత లభించింది. పెద్దల రక్షణ విషయంలో 16.06 పాయింట్లతో 5స్టార్‌ రేటింగ్‌, పిల్లల రక్షణ విషయంలో 25.00 పాయింట్లతో 3 స్టార్‌ రేటింగ్‌ లభించింది.

nexon
టాటా నెక్సాన్

మహీంద్రా మరాజో..

ప్రస్తుతం భారత్‌లో విక్రయిస్తున్న అత్యంత సురక్షితమైన ఎంపీవీ ఈ కారే. పెద్దల రక్షణ విషయంలో 12.85 పాయింట్లతో 4స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. ఇక పిల్లల రక్షణ విషయంలో 22.22 పాయింట్లతో 2స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

marrazo
మరాజో

ఫోక్స్‌వేగన్‌ పోలో..

పెద్దల రక్షణ విషయంలో 12.54 పాయింట్లతో 4 స్టార్‌ రేటింగ్‌ లభించింది. పిల్లల రక్షణ విషయంలో 29.91 పాయింట్లతో 3 స్టార్‌ రేటింగ్‌ను పొందింది.

polo
పోలో

మహీంద్రా థార్‌..

మహీంద్రా థార్‌ వాహనం పెద్దల రక్షణ విషయంలో 12.52 పాయింట్లతో 4 స్టార్‌ సాధించగా.. పిల్లల రక్షణ విషయంలో కూడా 41.11 పాయింట్లతో 4 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకోవడం విశేషం.

thar
థార్

టాటా టియాగో/టిగోర్‌..

టాటాకు చెందిన చెందిన టియాగో/టిగోర్‌ వాహనాలు రెండూ పెద్దల విషయంలో 12.52 పాయింట్లతో 4 స్టార్‌ రేటింగ్‌ను అందుకొన్నాయి. పిల్లల రక్షణలో 34.15 పాయింట్లతో 3 స్టార్‌ రేటింగ్‌ను సాధించాయి.

tiago
టాటా టియాగో

మారుతీ విటార బ్రెజా..

మారుతీ విటార బ్రెజా కారు పెద్దల విషయంలో 12.51 పాయింట్లతో 4 స్టార్‌ రేటింగ్‌, పిల్లల రక్షణ విషయంలో 17.93 పాయింట్లతో 2 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకొన్నాయి. టాప్‌టెన్‌ జాబితాలో స్థానం సాధించిన మారుతీ ఏకైక కారు ఇదే.

brezza
బ్రెజా

టాటా టిగారో ఈవీ..

జిప్ట్రాన్‌ టెక్నాలజీతో తయారు చేసిన టాటా టిగారో ఈవో పెద్దల రక్షణ విషయంలో 12 పాయింట్లతో 4 స్టార్‌ రేటింగ్ సాధించింది. ఛైల్డ్‌ ఆక్యూపెంట్‌ ప్రొటెక్షన్‌లో 37.24 పాయింట్లతో 4 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకొంది. క్రాష్‌ టెస్ట్‌లో పరీక్షించిన తొలి భారతీయ విద్యుత్తు వాహనం.

tigor
టాటా టిగోర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.