ETV Bharat / business

ముకేశ్‌ అంబానీ తర్వాత ఎవరు? - Mukesh Ambani Family Council

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కుబేరుడు ముకేశ్‌ అంబానీ... తర్వాత వారుసులు ఎవరు?అనే ప్రశ్నకు వచ్చే ఏడాది చివరి నాటికి సమాధానం రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంబానీ తాజాగా 'ఫ్యామిలీ కౌన్సిల్‌' ఏర్పాటులో ఉన్నట్లు సమాచారం.

Who are the successors after Mukesh Ambani
ముకేశ్‌ అంబానీ తర్వాత ఎవరు?
author img

By

Published : Aug 15, 2020, 6:43 AM IST

ఏ వ్యాపార సామ్రాజ్యంలోనైనా వారసత్వ ప్రణాళిక అనేది అత్యంత ముఖ్యమైనది. అందులోనూ అంబానీలాంటి కుబేరుడి విషయంలో మరింత ముఖ్యం. అందుకేనేమో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 'కుటుంబ మండలి'(ఫ్యామిలీ కౌన్సిల్‌)ని ఏర్పాటు చేయనున్నట్లు ఒక ఆంగ్ల పత్రికకు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి.

ఈ కౌన్సిల్‌లో కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. రిలయన్స్‌ పగ్గాలు చేపట్టనున్న ముకేశ్‌ ముగ్గురు సంతానమూ ఇందులో ఉంటారు. వీరితో పాటు బయటి వ్యక్తులు సలహాదార్లుగా ఈ కౌన్సిల్‌లో ఉండొచ్చని ఆ వర్గాలను ఉటంకిస్తూ ఒక కథనంలో తెలిపింది.

ఎందుకీ ఫ్యామిలీ కౌన్సిల్‌..

‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కీలక నిర్ణయాల విషయంలో ముఖ్యమైన పాత్రను ఈ కౌన్సిల్‌ పోషించనుంది. కుటుంబం లేదా కంపెనీ వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను అందరూ అంగీకరించే విధానంలో ఇది తీసుకుంటుంది. రిలయన్స్‌ భవిష్యత్‌కు ఇది చుక్కానిలా పనిచేయగలదు. అదే సమయంలో ఎటువంటి వివాదాలకైనా ఇది వేదికగా మారి పరిష్కారాలు చూపుతుంది. ధీరూభాయ్‌ మరణానంతరం సోదరుల మధ్య అప్పట్లో ఏర్పడ్డ వివాదాల నుంచి అంబానీ పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే కుటుంబ సభ్యుల మధ్య వివిధ అంశాలను సమన్వయం చేసే కార్యాచరణ వేదికగా ఈ కౌన్సిల్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. అంబానీ వారసులైన ఈషా, ఆకాశ్‌, అనంత్‌లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లోని వివిధ విభాగాల (రిటైల్‌, డిజిటల్‌, ఎనర్జీ)కు అధిపతులుగా ఉండే అవకాశం కనిపిస్తోందని ఆ వ్యక్తులు తెలిపారు.

ఎప్పటికల్లా నిర్ణయం..

వారసత్వ ప్రణాళిక ప్రక్రియను వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని 63 ఏళ్ల అంబానీ భావిస్తున్నట్లు ఆ వర్గాల్లోని ఒక వ్యక్తి తెలిపారు. కాగా, ఈ విషయాలపై రిలయన్స్‌ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

ఇప్పటికే కొంత స్పష్టత..

అక్టోబరు 2014లోనే ఆకాశ్‌, ఈషా అంబానీలు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో డైరెక్టర్లుగా చేరారు. ఇక అనంత్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా మార్చిలో చేరారు. ఆకాశ్‌, ఈసాలు కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌ బోర్డులో ఉన్నారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌లోనూ ఈషా అంబానీ ఇక డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలి కాలంలో ముకేశ్‌, నీతా, ముగ్గురు సంతానం మధ్య రిలయన్స్‌ షేర్లు చేతులు మారడం ద్వారా వాటాల్లో మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆకాశ్‌, అనంత్‌లు అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా.. ఈషా యేల్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పుచ్చుకున్నారు.

గట్టి అడుగులు..

ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాల విక్రయం, కొనుగోళ్లలో తలమునకలైంది. ముఖ్యంగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా భారీగా నిధులను సేకరించింది. భారీ నిధుల సమీకరణ కారణంగా ఆర్‌ఐఎల్‌ రుణ రహిత సంస్థగా మారింది. ఈ ప్రభావంతో ఆర్‌ఐఎల్‌ షేరు దూసుకెళ్లడంతో టాప్‌-10 కుబేరుల జాబితాలో చేరిన ముకేశ్‌.. 80 బి.డాలర్లకు పైగా సంపదతో నాలుగో స్థానానికి చేరారు. మరోవైపు భవిష్యత్‌కు ఢోకా లేకుండా స్థిరమైన అడుగులు వేస్తోంది. భారత 5జీ పరుగులో జియోనే ముందు ఉంటుందనడంలో సందేహం లేదు.

ఈ ఒప్పందాలు జరిగితే..

ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆరామ్‌కో-రిలయన్స్‌ ఒప్పందం జరిగితే చమురు నుంచి రసాయనాల వ్యాపారం(ఓ2సీ)లో రిలయన్స్‌కు తిరుగుండదు. ఇక కొన్ని వార్తల ప్రకారం.. టిక్‌టాక్‌ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో రిలయన్స్‌ ఉంది. మరో పక్క, కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌లోనూ మెజారిటీ వాటాను సొంతం చేసుకునే ప్రణాళికల్లో ఉందన్న వార్తలూ ఉన్నాయి. ఇవన్నీ వాస్తవరూపం దాలిస్తే రిలయన్స్‌ భవిష్యత్‌కు ఢోకా ఉండదు.

ఇదీ చూడండి: టాటాసన్స్ చేతికి ఎయిర్ ​ఇండియా పగ్గాలు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.