ETV Bharat / business

ఫై‌నాన్షియల్​ ప్లానర్‌.. మీకు అవసరమా? కాదా? - finacial issues

ఆర్థిక ప్రణాళికలో అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే మోడల్‌ ఉండదు. వ్యక్తిగత ఖర్చులు, సంపాదన, అవసరాలు, లక్ష్యాల ఆధారంగా ఎవరి ప్రణాళిక వారికి ఉంటుంది. స్పష్టత లేని పక్షంలో వ్యక్తిగత ఆర్థిక సలహాదారుడిని నియమించుకోవటం మేలు. మీ జీవితానికి సంబంధించిన అన్ని ఆర్థిక అంశాలను పరిశీలించి.. మీ ప్రణాళికను వాళ్లు తయారు చేస్తారు. అయితే, ఏ సమయంలో వీరి సాయం పొందాలన్న విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. వాటికి సమాధానాలు మీకోసం..

financial planeer
ఫైనాన్సియల్‌ ప్లానర్‌
author img

By

Published : Sep 8, 2020, 5:55 PM IST

కారు కొనేందుకు లేదా పిల్లల ఉన్నత విద్య, విదేశీ పర్యటనలు తదితరాల కోసం డబ్బులు పొదుపు చేస్తున్నారా? వాటికి పెట్టుబడి పెట్టిన సాధనాలు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సొంతంగా స్పష్టమైన సమాధానాలు రావటం లేదా? అయితే వ్యక్తిగతంగా ఆర్థిక ప్రణాళికపై సలహాలు ఇచ్చే వారు.. ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మీకు సరిపడే ప్రణాళికను వాళ్లు తయారు చేస్తారు.

సరైన ఆర్థిక సలహాదారును ఎంచుకోవటం చాలా ముఖ్యం. ఉద్యోగం ప్రారంభించిన కొత్తలో సాధారణంగా ఎక్కువ మార్గదర్శకత్వం అవసరం ఉండదు. కెరీర్​ మధ్యలో ఉండి, మంచి స్థాయిలో దీర్ఘకాల లక్ష్యాలు ఉన్నట్లయితే.. ఆదాయం, రుణాలు, ఆస్తులపై సంపూర్ణంగా అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్‌ నాటికి లక్ష్యాలు చేరుకుంటారు కాబట్టి అప్పుడు కూడా తక్కువ గైడెన్స్‌ అవసరమే ఉంటుంది.

మార్కెట్‌లో ఫైనాన్సియల్‌ ప్లానర్స్‌, ఇండిపెండెంట్‌ ఫై‌నాన్షియల్​‌ అడ్వైజర్స్‌, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా పలు రకాల సలహాదారులు ఉన్నారు. మీకు కావాల్సిన సేవలు, దానికోసం వెచ్చించే మొత్తం ఆధారంగా మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

మీకు ఫై‌నాన్షియల్​ ప్లానర్‌ అవసరమా?

మీరు ఉద్యోగం ఇటీవలే ప్రారంభించి.. మీపై ఆధారపడే వారు, చెల్లించాల్సిన రుణాలు లేనట్లయితే మీ జీవితంలో పెద్దగా సంక్లిష్టతలు లేనట్టే. ఈ సందర్భంలో మీరు కొన్ని అంశాలను సరిగా చూసుకోవటం ద్వారా ఆర్థిక భవితను మెరుగుపరుచుకోవచ్చు. రిటైర్మెంట్‌ అయిన వారు దాదాపు అన్ని ఆర్థిక లక్ష్యాలను చేరుకొని ఉంటారు. కేవలం ఆస్తులను సంరక్షించుకుంటే సరిపోతుంది. ఇలాంటి సందర్భంలో కూడా తక్కువ సలహాలే అవసరం ఉంటాయి.

ఇవి రెండు కాకుండా దాదాపు అన్ని మిగతా సందర్భాల్లో ఆర్థిక ప్రణాళిక తయారు చేసే వృత్తి నిపుణులు అవసరం ఉంటుందని వ్యక్తిగత ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అలా అని రాబడి ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో ఫై‌నాన్షియల్​‌ ప్లానర్లను నియమించుకోకూడదని వారు సూచిస్తున్నారు.

పెట్టుబడుల విషయంలో..

పెట్టుబడులను మన అవసరాలకు సరిపడేలా చూసుకునేందుకు, తప్పులను చేయకుండా ఉండేందుకు వారు ఉపయోగపడుతారు. కొంచెం మొత్తంలో పెట్టుబడి అయినా.. సాధనాన్ని బట్టి భారీ తేడా కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

పెట్టుబడి సాధనం సరైనదా? కాదా? అన్నది కూడా ఫై‌నాన్షియల్​‌ ప్లానర్లు చెబుతారు. చాలా మంది తమకు సరిపోని సాధనాల్లో పెట్టుబడి పెట్టి డబ్బులు కోల్పోతుంటారు. జీవితంలో ఉన్న దశ, ఆదాయం తదితర అంశాలకు అనుగుణంగా ఉండే పోర్ట్‌ఫోలియోను ఫైనాన్షియల్‌ ప్లానర్‌ తయారు చేస్తారు. మీరు తీసుకునే రిస్కును కూడా వాళ్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ మొత్తం నష్ట పోకుండా.. రిస్కును తగ్గించుకోమని కూడా సూచిస్తుంటారు.

ఎలా ఎంచుకోవాలి.?

ఫై‌నాన్షియల్​‌ ప్లానర్‌ను ఎంచుకోవటంలో వారికి సంబంధించి వ్యాపార సరళి గురించి తెలుసుకోవాలి. అనంతరం ఎలాంటి వ్యాపార సరళి ఉన్న వారిని నియమించుకోవాలన్న దానిపై స్పష్టత వస్తుంది.

కొందరు ఫై‌నాన్షియల్​‌ సలహాదారులకు మ్యూచువల్‌ ఫండ్‌, బీమా కంపెనీలతో సంబంధాలు ఉంటాయి. ఇలాంటి వారు ఆర్థిక ప్రణాళిక తయారు చేసేందుకు, సలహా ఇచ్చేందుకు ఫీజు వసూలు చేయరు లేదా తక్కువ మొత్తం తీసుకుంటారు. అయితే సంబంధాలు ఉన్న కంపెనీ బీమా, పెట్టుబడులను సూచించే అవకాశం ఉంటుంది. ఆయా సంస్థల వచ్చే కమీషన్ల ద్వారా వాళ్ల వ్యాపారం నడుస్తుంది.

కొందరు కస్టమర్లు ఇచ్చే ఛార్జీల ద్వారా మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి వారికి కంపెనీల నుంచి కమీషన్‌ రాదు. ఛార్జీ చేసే వారు సాధారణంగా అన్ని కంపెనీలను గమనించి, అందుబాటులో ఉన్న మంచి పెట్టుబడి సాధనాల గురించి సూచించే అవకాశం ఉంటుంది.

కొందరు కస్టమర్ల వద్ద నుంచి వచ్చే ఛార్జీతో పాటు సూచించే పెట్టుబడులకు సంబంధించి కంపెనీల నుంచి వచ్చే కమీషన్‌ను కూడా తీసుకుంటారు. తద్వారా వారి వ్యాపారం కొనసాగుతుంది. ఫై‌నాన్షియల్​‌ ప్లానర్ల వ్యాపార సరళి, తీరు, వారి వ్యాపారంలో పారదర్శకత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఫీజు ఎంత?

పన్ను సేవింగ్‌ పెట్టుబడుల నుంచి పోర్ట్‌ఫోలియోను తరచూ మానిటర్‌ చేయటం, వాటికి సంబంధించి రిపోర్టులను పంపటం వరకు వివిధ రకాల సర్వీసులను ఫై‌నాన్షియల్​‌ ప్లానర్లు అందిస్తారు. పూర్తి వివరాలతో కూడిన ఆర్థిక ప్రణాళిక... ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వంటి అంశాలను కలిగి ఉంటుంది. వీటిని సమయానుగుణంగా మార్చుకోవటం గురించి కూడా తెలుపుతుంది.

ఫై‌నాన్షియల్​ ప్లానర్​కు సంబంధించినంత వరకు రకరకాలు ఫీజులు ఉంటాయి. వారి అర్హత, అనుభవంతో పాటు అందించే సేవలు, వారున్న కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మార్కెట్‌ను బట్టి నిర్ణయిస్తారు.

క్లయింట్‌ విషయంలో ఎంత సమయం వెచ్చిస్తామన్న విషయంలో మంచి ఫైనాన్సియల్‌ ప్లానర్‌ స్పష్టంగా ఉంటారు. వారి వద్దకు వచ్చిన అందరు క్లయింట్‌లను వారు తీసుకోరు. అనుభవాన్ని బట్టి కొందరు ప్లానర్లు ఫీజును భారీగా నిర్ణయిస్తారు. ఇలాంటి వాళ్లు లిమిటెడ్‌గా క్లయింట్‌లను తీసుకుంటారు.

ముందుగా పరిశీలించండి..

కేవలం ఫీజు ద్వారా వ్యాపారం నిర్వహించుకునే వారిలో కొందరు నిర్ణీత మొత్తంలో ఫీజు తీసుకుంటారు. కొందరు వాళ్లు నిర్వహించే అస్తులు, పెట్టుబడుల్లో కొంచెం శాతాన్ని తీసుకుంటారు. శాతాన్ని బట్టి ఫీజు తీసుకునే వారికి సంబంధించి ప్రారంభంలో తక్కువ ఫీజు మాత్రమేనని అనిపించినప్పటికీ.. సంవత్సరాలు మారుతున్న కొద్దీ ఈ మొత్తం ఎక్కువ అవుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు.

మీరు విశ్వసించే వ్యక్తుల నుంచి ఫై‌నాన్షియల్​‌ ప్లానర్ల గురించి తెలుసుకోవచ్చు. ఆ ఫై‌నాన్షియల్​‌ ప్లానర్‌ వద్దకే వెళ్లి మీరు కూడా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో ఫై‌నాన్షియల్​‌ ప్లానర్ల గురించి అధ్యయనం చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.