ETV Bharat / business

చైనా స్థాయిలో భారత్​లో ఇంధన గిరాకీ పెరిగేది ఎప్పుడు?

author img

By

Published : May 27, 2020, 7:41 AM IST

కొవిడ్‌ కారణంగా రెండు నెలలుగా ఎక్కడి చక్రాలు అక్కడ ఆగిపోయాయ్‌. సడలింపుల అనంతరం ఇపుడిపుడే ముందుకు కదులుతున్నాయి. ఇంధనానికి గిరాకీ పెరుగుతోంది. వ్యాపార లావాదేవీలన్నింటికీ అనుమతులిస్తే, ఇంధన వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే చైనాలోలాగా కరోనా పూర్వపు స్థాయిలకు, ఇంధన గిరాకీ దూసుకెళుతుందా లేదా అన్నదే అసలు ప్రశ్న.

petrol demand
ఇంధన గిరాకీ

చైనాలో కరోనా వైరస్‌ వచ్చింది.. పోయిందన్నారు.. మళ్లీ కనిపిస్తోంది. అక్కడ ఇంధన గిరాకీ మాత్రం కరోనా పూర్వపు స్థాయికి చాలా సులువుగా చేరింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు విపణి అయిన భారత్‌లో రెండు నెలల లాక్‌డౌన్‌ కారణంగా ఇంధన వినియోగం బాగా క్షీణించింది. తిరిగి పుంజుకోడానికి నెలల సమయం పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

దేశమంతా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒక దశలో భారత్‌లో 70 శాతం మేర ఇంధన వినియోగం పడిపోయింది. ఆంక్షలు సడలిస్తున్న కారణంగా గతేడాదితో పోలిస్తే 40 శాతం తక్కువ స్థాయిల్లో గిరాకీ కనిపిస్తోంది. పూర్తిగా మునుపటి స్థాయికి వెళ్లాలంటే మాత్రం ఏడాది చివరి వరకు వేచిచూడాల్సిందేనని ప్రభుత్వ రంగ రిటైల్‌ కంపెనీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

2-3 నెలల్లో 80 శాతం

"సాధారణ విక్రయాల్లో 80 శాతం స్థాయికి చేరుకోవడానికి 2-3 నెలల సమయం పట్టొచ్చు.. అయితే ఆ తర్వాత 100 శాతానికి చేరుకోవడానికి మాత్రం మరింత గడువు అవసరం కావచ్చు." అని హెచ్‌పీసీఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సురానా అంటున్నారు.

  • గతేడాది మేలో భారత్‌ 46 లక్షల బారెళ్ల చమురును మనం వినియోగించాం. అది ఇపుడు 28 లక్షల బారెళ్లుగా ఉందని బ్లూమ్‌బర్గ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  • ఇక పెట్రోలు, డీజిల్‌ గిరాకీ గతేడాదితో చూస్తే 47%, 35% చొప్పున తక్కువగా ఉన్నాయి. గత నెలలో ఈ గిరాకీ వరుసగా 65%, 55% చొప్పున ఉంది.

"సరకు లారీలతో పాటు బస్సులు, రైళ్లు, విమానాలకు క్రమంగా అనుమతులు ఇస్తుండటం, వాహన విక్రయాలు కూడా పునరుద్ధరించినందున.. లాక్‌డౌన్‌ సమయంలో 85 శాతం క్షీణించిన ఇంధన గిరాకీ తిరిగి గాడిన పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ సేవలు మొదలైతేనే, విమాన ఇంధనానికి గిరాకీ మునుపటి స్థాయికి చేరుకోగలదు. మొత్తం మీద ఇంధన గిరాకీ తిరిగి మూడు నాలుగు నెలల్లో 80-85 శాతానికి చేరవచ్చు" అని బీపీసీఎల్‌ డైరెక్టర్‌ ఆర్‌.రామచంద్రన్‌ పేర్కొంటున్నారు.

చైనాతో బ్రెంట్‌ చమురుకు ఊతం

కరోనా నుంచి కోలుకోవడంతో పాటు.. కార్యకలాపాలు దాదాపు సాధారణ స్థాయికి చేరుకోగా చైనాలో ఇంధన వినియోగం పుంజుకుంది. అదే బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ బారెల్‌ ధర 35 డాలర్లకు చేరుకోవడానికి దోహదం చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఉత్పత్తిదారులు ఉత్పాదకత కోతలకు కట్టుబడి ఉండడం కూడా మరో కారణం.

గిరాకీకి అదే ఆధారం

భారత డీజిల్‌ విక్రయాల్లో 40 శాతం వరకు రవాణా, పరిశ్రమల నుంచే నమోదవుతాయి. ఆంక్షల సడలింపు అనంతరం పరిశ్రమల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడం వల్ల ఏప్రిల్‌ తొలి భాగంతో పోలిస్తే మే నెల తొలి 15 రోజుల్లో డీజిల్‌ వినియోగం 75 శాతం మేర పెరిగింది. ప్రజలు ప్రజా రవాణా కంటే సొంత కార్లు లేదా టాక్సీలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నందున పెట్రోలు గిరాకీ కూడా పుంజుకోనుంది.

డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉండే ట్రక్కుల పరిశ్రమ ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ 70 శాతం రవాణా రంగం స్తబ్దుగానే ఉంది. అది పుంజుకుంటేనే డీజిల్‌ విక్రయాలు పెరుగుతాయి. అయితే దూరపు ప్రయాణాలు ఇప్పట్లో కష్టమే కాబట్టి గిరాకీ కూడా నెమ్మదిగానే పెరగొచ్చు. మొత్తం మీద ఏడాది చివర లేదా 2021 ప్రారంభానికి కానీ పూర్వపు పరిస్థితులు కనిపించకపోవచ్చు.

పెట్రో ధరలు తగ్గవు!

ప్రస్తుతం ప్రభుత్వం భారీ స్థాయిలో కరోనాపై పోరాటానికి వెచ్చిస్తోంది. ఈ సమయంలో ప్రధాన ఆదాయ వనరైన ఇంధనంపై పన్నును తగ్గించకపోవచ్చు. అంటే ధరల్లో కోతలు ఉండకపోవచ్చు. ఎందుకంటే కరోనా కారణంగా ఇప్పటికే ప్రభుత్వం జీడీపీలో 0.8 శాతం మేర ఖర్చుపెట్టడానికి కట్టుబడి ఉంది. ఈ ఏడాది వృద్ధి కూడా -1 శాతానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. ద్రవ్యలోటు సంగతి సరే సరి.. అది 2020-21లో 5.2 శాతానికి చేరవచ్చు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయాన్ని ఇచ్చే దేనినీ ప్రభుత్వం వదులుకోదు. కాబట్టి అంతర్జాతీయంగా తగ్గినా, దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయన్న అంచనాలు ఏమాత్రం లేవు. విమాన ఇంధన ధర తగ్గినా, సర్వీసులు అరకొరగానే ప్రారంభమవుతున్నందున, కంపెనీలకు కలిసొచ్చేది పెద్దగా లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.