ETV Bharat / business

'వాహనం' పరుగు తీసేదెప్పుడు? - ఆటొమొబైల్‌ రంగం

ఆటోమొబైల్‌ రంగం గత సంవత్సరం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. గత ఏడాదితో పోలిస్తే అన్నిరకాల వాహనాల అమ్మకాలూ 14 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 12 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 15 నుంచి 17 శాతం తగ్గాయి. ఫలితంగా ఈ రంగంలోని ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడింది. భారతీయ వాహన రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గడిచిన ఏడాదిన్నరలో ఉత్పత్తిలో కోతల కారణంగా మూడులక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా.

When does the 'vehicle' run?
'వాహనం'’ పరుగు తీసేదెప్పుడు?
author img

By

Published : Feb 29, 2020, 7:32 AM IST

Updated : Mar 2, 2020, 10:30 PM IST

ఆటోమొబైల్‌ రంగం గత సంవత్సరం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అన్నిరకాల వాహనాల అమ్మకాలూ 14 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 12 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 15 నుంచి 17 శాతం తగ్గాయి. భారీ వాహనాల విక్రయాలు 40 శాతం మేర పతనమయ్యాయి. 2017-18లో రెండంకెల్లో ఉన్న అమ్మకాల వృద్ధి ఏడాదిన్నర నుంచి ఎవరూ ఊహించనంతగా ‘మైనస్‌’కి పడిపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మహింద్రా అండ్‌ మహింద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, టయోటా, హీరో మోటాకార్ప్‌ లాంటి ప్రముఖ తయారీ సంస్థలు ఉత్పత్తులను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

వాహన విడిభాగాల సంస్థలైన బాష్‌, వ్యాబ్కో, జమ్నా ఆటొలపై సైతం ప్రభావం పడటంతో తయారీలో కోత విధించాయి. ఫలితంగా ఈ రంగంలోని ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడింది. భారతీయ వాహన రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గడిచిన ఏడాదిన్నరలో ఉత్పత్తిలో కోతల కారణంగా మూడులక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా.

కారణాలెన్నెన్నో...

వాహన రంగం కుదేలైపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆర్థిక మందగమనం అందులో మొదటిది. దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధిరేటు పతనమైంది. అన్ని రంగాలతోపాటు ఆటొమొబైల్‌ పరిశ్రమపైనా దీని ప్రభావం పడింది. రోడ్డు టాక్సులు, వాహన రిజిస్ట్రేషన్‌ రుసుములను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచేసింది. 2018 ఆగస్టు నుంచి సరకు రవాణా ట్రక్కులకు అధిక లోడు పరిమితులివ్వడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. దీంతో పాత ట్రక్కులే 20 శాతం వరకు అధిక సరకు రవాణా చేస్తున్నాయని ‘క్రిసిల్‌’ సంస్థ అంచనా వేసింది. ఇది కొత్త వాణిజ్య వాహనాల అమ్మకాలకు అశనిపాతమే.

బైక్​కు అయిదేళ్లు, కార్లకు మూడేళ్లు

ఇక కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు అయిదేళ్లు, కార్లకు మూడేళ్లు దీర్ఘకాలిక బీమా తప్పనిసరి అని సుప్రీంకోర్టు చెప్పడం కొనుగోలుదారులకు భారంగా మారింది. ఈ మధ్యకాలంలో తలెత్తిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఆటొమొబైల్‌ పరిశ్రమకు శరాఘాతంలా తగిలింది. వాహన రంగానికి ఇలాంటి బ్యాంకింగేతర, ప్రైవేటు ఆర్థిక సంస్థలనే మూలస్తంభాలుగా చెప్పుకోవచ్చు. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా కొనుగోళ్లలో సింహభాగం రుణాలిచ్చేవి ఇలాంటి బ్యాంకింగేతర, ప్రైవేటు ఆర్థిక సంస్థలే.

ఎనిమిది నుంచి పది శాతం అదనపు భారం

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కారణంగా రుణ లభ్యత భారీగా తగ్గిపోయింది. వాహన కొనుగోళ్లకు ఈ సంస్థలు ఆచితూచి రుణాలిస్తున్నాయి. మరోవైపు 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-6 నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తుండటంతో తయారీ కంపెనీలు, డీలర్లకు పాత స్టాకును వదిలించుకోవడం సవాలుగా మారింది.

బీఎస్‌-6 నిబంధనలతో పర్యావరణానికి, మానవాళికి ఎంతో లబ్ధి చేకూరుతున్నా ఈ ప్రమాణాలు అందుకోవడానికి, సాంకేతికత పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ఆటొమొబైల్‌ కంపెనీలకు ఒక్కో వాహనంపై సగటున ఎనిమిది నుంచి పది శాతం అదనపు ధర భారం పడుతోంది. ఈ ప్రతికూలతలన్నీ తట్టుకొని దసరా, దీపావళి పండగ సీజన్లలో అమ్మకాల్లో కొద్దిగా వృద్ధి కనిపించింది. ఆ తరవాత ఈ ఉత్సాహం కొనసాగలేదు. ఈ ఏడాది మొదటి నెలలోనే మళ్ళీ అమ్మకాల్లో 6.2 శాతం క్షీణత కనిపించింది.

22 నుంచి 15 శాతానికి తగ్గింపు

భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వాహన పరిశ్రమ వాటా ఏడు శాతం. ఇంతటి కీలకమైన రంగం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని పరిశ్రమ అధిపతులు పదేపదే కోరడంతో ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును 22 శాతానికి, వాహనాల తరుగుదల విలువను 15 శాతానికి తగ్గించింది. ఇవి కంటితుడుపు చర్యలు మాత్రమే. 2008, 2014 సంవత్సరాల్లో ఇలాంటి గడ్డు పరిస్థితే ఎదురైనప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ సుంకం భారీగా తగ్గించి పరిశ్రమకు ఊపిరులూదింది. తాత్కాలికంగానైనా సమస్య నుంచి గట్టెక్కడానికి ఈ తరహా సుంకాల తగ్గింపును అందరూ కోరుతున్నారు. జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంవల్ల ధరలో గణనీయమైన మార్పు వచ్చి అమ్మకాలు ఊపందుకుంటాయని పరిశ్రమ ఆశిస్తోంది.

స్పందన బాగుంది...

ఆటొమొబైల్‌ రంగం ఏటా నిర్వహించే ‘ఆటొ ఎక్స్‌పో’ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. కంపెనీలు కొత్త మోడళ్లు విడుదల చేస్తుండటం, ఉన్నవాటిని అప్‌గ్రేడ్‌ చేయడంతో వినియోగదారుల చూపు పడి అమ్మకాల్లో కదలిక వస్తుందని ఈ కార్యక్రమాన్ని ‘సెంటిమెంట్‌’గా భావిస్తుంటారు. దానికి తగ్గట్లే ఇటీవల నిర్వహించిన ‘ఆటొ ఎక్స్‌పో-2020’లో ద్విచక్రవాహనాల నుంచి భారీ ట్రక్కుల వరకు సరికొత్త మోడళ్లు ప్రదర్శించారు. స్పందన సైతం బాగుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో 2020-21 వాహన రంగానికి మేలి మలుపు కాబోతుందా లేదా అన్నది వేచిచూడాలి.

తుక్కు విధానం కోసం నిరీక్షణ

అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ తుక్కు విధానం (స్క్రాపేజ్‌ పాలసీ)వైపు పరిశ్రమ గంపెడాశతో ఎదురుచూస్తోంది. మొన్నటి బడ్జెట్‌లోనూ దీనికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనా లేదు. పరిశ్రమ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం 1995 నుంచి 2005 మార్చి 31 మధ్య రిజిస్టర్‌ అయిన వాహనాలను తుక్కుగా పరిగణించి, వాటిని రాబోయే ఏప్రిల్‌ ఒకటి నుంచి రోడ్లపై తిరగనీయకుండా చూడాలి. ప్రతిఫలంగా వాహనదారులు, తయారీదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇలా చేస్తే వాహన అమ్మకాలు ఊపందుకోవడానికి అవకాశం ఉందంటున్నారు. ఈ విధానానికి ఒప్పుకొని కొత్త వాహనం కొనేవారికి జీఎస్‌టీలో 50 శాతం రాయితీ, రోడ్డు టాక్సులో 50 శాతం రిబేటు ఇవ్వాలని భారతీయ వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) ప్రభుత్వాన్ని కోరుతోంది. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. పరిశ్రమా బాగుపడుతుంది. ఈ విధానం పట్ల తాము సానుకూలంగా ఉన్నామంటూనే ఎన్‌డీఏ ప్రభుత్వం- అయిదేళ్లుగా తుక్కు విధానం ప్రకటన పట్ల సాచివేత ధోరణి అవలంబిస్తోంది.

పదిరోజుల క్రితం జరిగిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటొమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) సమ్మేళనంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ‘స్క్రాపేజీ పాలసీ’ చివరి దశలో ఉందని, నెల రోజుల్లో మంత్రిమండలి ఆమోదం పొందుతుందని ప్రకటించారు. ఈ విధానం అమలులోకి వస్తే అది వాహన రంగానికి పెద్ద శుభవార్తే. ప్రస్తుతానికి వాహన రంగం క్లిష్టదశలో ఉన్నా భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తీకరిస్తున్నారు. ప్రభుత్వ సహకారం తోడై, ఆర్థిక మందగమన మబ్బులు కరిగి, పరిస్థితులన్నీ అనుకూలిస్తే వాహన రంగం ముందుకు దూసుకెళ్తుందనడం నిర్వివాదం!

కరోనాతో సమస్య తీవ్రతరం

అసలే కష్టాల్లో ఉన్న ఆటొమొబైల్‌ రంగానికి గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భూతం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మనదేశంలో తయారవుతున్న వాహనాల ఉత్పత్తిలో కీలకమైన ఫ్యూయల్‌ ఇంజక్షన్‌ పంప్‌లు, ఈజీఆర్‌ మాడ్యూళ్లు, ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, టర్బోఛార్జర్లలాంటి విడిభాగాలు అత్యధికం చైనా, ఆగ్నేయాసియా దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. అక్కడ కరోనా ఉద్ధృతంగా ఉండటంతో ఆ దేశాల నుంచి రాకపోకలు, వ్యాపార లావాదేవీలకు అడ్డుకట్ట పడింది. ఈ సరఫరాలో అంతరాయం కారణంగా 2020లో వాహన ఉత్పత్తులు 8.3 శాతం తగ్గే అవకాశం ఉందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది.

-శ్రీనివాస్‌ బాలె

Last Updated : Mar 2, 2020, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.