ETV Bharat / business

నంబర్​ మార్చినా వాట్సాప్ ఛాట్స్​ బదిలీకి ఛాన్స్!

ప్రముఖ ఛాటింగ్ యాప్ వాట్సాప్​ యూజర్లకు ఈ ఏడాది సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్​ల మధ్య ఛాటింగ్, ఇతర డేటాను బదిలీ చేసుకునేందుకు వీలుగా ఈ ఫీఛర్​ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ కొత్త ఫీచర్ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

WhatsApp Will Soon Let You Transfer Chats to a Different Phone Number
వేరే ప్లాట్ ఫాంపై కొత్త నెంబర్ కూ వాట్సాప్ చాట్
author img

By

Published : May 23, 2021, 1:11 PM IST

ఆండ్రాయిడ్, ఐఓఎస్​ల మధ్య ఛాట్​లు సులువుగా బదిలీ(ఛాట్ మైగ్రేషన్) చేసేందుకు వీలుగా సరికొత్త ఫీచర్​ను తీసుకురావడానికి వాట్సాప్ ఇటీవలే ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త ఓఎస్​తో పాటు.. కొత్త ఫోన్​ నంబర్​కూ ఛాటింగ్ డేటా ట్రాన్స్​ఫర్ చేసుకునే సదుపాయం ఈ ఫీచర్​లో ఉండనున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో అనే టెక్​ న్యూస్ సంస్థ పేర్కొంది.

కొత్త ఫీచర్ విశేషాలు..

ప్రస్తుతానికి వాట్సాప్​లో ఒకే ప్లాట్ ఫామ్​లో(ఆండ్రాయిడ్​ నుంచి ఆండ్రాయిడ్​కు లేదా ఐఓఎస్​ నుంచి ఐఓఎస్​కు) ఛాట్​ హిస్టరీని బదిలీ చేయడం చాలా సులభం. అయితే ఇటీవల చాలా మంది ఆండ్రాయిడ్​ నుంచి ఐఓఎస్​కు లేదా ఐఓఎస్​ నుంచి ఆండ్రాయిడ్​కు మారుతుండటం సాధారణమైంది. ఈ నేపథ్యంలో క్రాస్​ ఓఎస్​ ప్లాట్​ఫామ్ ఛాట్​ ట్రాన్స్​ఫర్ ఫీచర్​ తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారభించింది వాట్సాప్​.

అయితే ఈ సదుపాయం కొత్త ప్లాట్ ఫామ్​పై వాట్సాప్ అకౌంట్​కు లాగిన్ అయ్యే సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ కొత్త ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి రానుంది అనే వివరాలు మాత్రం వాట్సాప్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చూడండి: కొత్త ప్రైవసీ పాలసీలపై వాట్సాప్​కు కేంద్రం వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.