ETV Bharat / business

'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్! - whats app latest news

WhatsApp
వాట్సాప్
author img

By

Published : May 7, 2021, 5:43 PM IST

Updated : May 7, 2021, 6:08 PM IST

17:41 May 07

'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్.. తన ప్రైవసీ పాలసీపై వెనక్కు తగ్గింది. ఇదివరకు మే 15 లోపు నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించాలని ఖాతాదారులకు సూచించిన వాట్సాప్... అలా చేయడం తప్పనిసరి కాదని తాజాగా స్పష్టం చేసింది. వాట్సాప్​ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని వారి అకౌంట్లను తొలగించబోమని వెల్లడించింది.

" ఈ అప్డేట్​ వల్ల మే 15 తర్వాత ఏ ఒక్కరి ఖాతాను డిలీట్​ చేయం. భారత్​లోని ఖాతాదారులకు మునుపటి లాగే వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. రాబోయే వారాల్లో మా  నియమ నిబంధనలను అంగీకరించని ఖాతాదారులకు రిమైండర్లు పంపుతాం."  

        -- వాట్సాప్ సంస్థ అధికార ప్రతినిధి  

అయితే.. వాట్సాప్ తమ నూతన ప్రైవసీ విధానాన్ని ఎందుకు రద్దు చేసుకుందో మాత్రం వెల్లడించలేదు. వాట్సాప్​ సమాచారాచాన్ని.. ఫేస్​బుక్​తో పంచుకుంటామని గతంలో ఆ సంస్థ ప్రకటించగా.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

Last Updated : May 7, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.