ETV Bharat / business

WhatsApp: వాట్సాప్​ నయా ఫీచర్​ ఇలా..

'వ్యూవ్​ వన్స్​' ఫీచర్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది వాట్సాప్​. ఈ ఫీచర్​ టెస్టింగ్​ కోసం ఇప్పటికే ఆండ్రాయిడ్​ బీటాలో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫొటోలు, వీడియో పంపింతే, ఎవరైనా కేవలం ఒక్కసారే వాటిని చూడగలుగుతారు.

whatsapp view once
వాట్సాప్​ ఫీచర్​
author img

By

Published : Jul 3, 2021, 3:54 PM IST

వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించేందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​(WhatsApp) ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరో అప్డేట్​ను పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 'వ్యూవ్​ వన్స్​' (WhatsApp View Once) ఫీచర్​ను ఆండ్రాయిడ్​ బీటా టెస్టర్లు పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్​తో ఫొటోలు, వీడియోలను.. ఒక్కసారి చూసిన అనంతరం అవి వాటంతట అవే డిలీట్​ అయిపోతాయి.

ఈ ఫీచర్ (WhatsApp latest features)​ త్వరలో వాట్సాప్​లో అందుబాటులో ఉంటుందని ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ వెల్లడించారు.

ఎలా పనిచేస్తుంది?

ఈ వ్యూవ్​ వన్స్​ ఫీచర్​ ద్వారా ఏవైనా ఫొటోలు, వీడియోలు పంపితే.. వాటిని కేవలం ఒక్కసారే చూడగలుగుతారు. చూసిన వెంటనే నోటిఫికేషన్​ కూడా వస్తుంది. 'రీడ్​ రెసీపియంట్​'ను ఆఫ్​ చేసినా కూడా.. ఫొటో చూసినట్టు పంపినవారికి కనపడుతుంది.

అయితే.. ఆ ఫొటోనూ స్క్రీన్​ షాట్​ తీసుకోవడం, వీడియోను రికార్డ్​ చేయడం వంటివి చేస్తే మాత్రం నోటిఫికేషన్​ అందదు.

గ్రూప్​లలో కూడా ఈ వ్యూవ్​ వన్స్​ ఫీచర్​ ద్వారా షేర్​ చేసుకోవచ్చు. ఈ ఫైల్​ను ఎవరు చూశారన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్​ను ఎనేబుల్​ చేసుకోని వారికి కూడా ఇది వర్తిస్తుంది.

ఇదీ చూడండి:- బెస్ట్ క్వాలిటీ వీడియోలు వాట్సాప్​లో పంపెయ్యండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.