ETV Bharat / business

'వాట్సాప్​ బిజినెస్'లో మరిన్ని ఫీచర్లు​ - వాట్సాప్‌ బీటా వెర్షన్

మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను ఎత్తిచూపేందుకు ఓ స్టిక్కర్ ప్యాక్‌ను ప్రవేశపెట్టిన ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలో మరిన్ని ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా బిజినెస్​ అకౌంట్​లో మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

WhatsApp
వాట్సాప్
author img

By

Published : Apr 22, 2021, 2:40 PM IST

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'వాట్సాప్‌'.. చాటింగ్​ను మరింత సులభతరం చేసేందుకు రెండు నూతన ఫీచర్లు తేనున్నట్లు సమాచారం. 'న్యూ చాట్ షార్ట్​కట్', యానిమేషన్​ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిసింది.

బిజినెస్ సమాచార విభాగంలో చాట్ షార్ట్​కట్​లను సరికొత్తగా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వాట్సాప్ గతంలో​నే తెలిపింది. అప్‌డేట్ చేస్తోన్న 'యూఐ'లో బిజినెస్​ అకౌంట్​ వినియోగదారులు స్క్రీన్ మధ్యలోనే మెసేజ్, వాయిస్ కాల్, కాటలాగ్, ఫార్వర్డ్ అనే ఆప్షన్స్​ను ఉపయోగించేలా​ తీర్చిదిద్దనుంది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉందని సమాచారం. ప్రస్తుతం.. బిజినెస్​ సమాచారం ఎడమవైపున కనిపిస్తోంది.

యానిమేటెడ్ హెడర్ అనే మరో ఫీచర్​ను వాట్సాప్​ పరీక్షిస్తున్నట్లు 'వెబ్​బీటా' అనే టెక్​ వెబ్​సైట్ తెలిపింది. అదృశ్యమైన సందేశాల కోసం చాటింగ్​లలో ఇమేజ్​తో కూడిన మెసేజ్​లకు.. యానిమేషన్​ ఆప్షన్​ను జోడించవచ్చు. ఫలితంగా అదృశ్యమైన సందేశాల గురించి వినియోగదారులు సులువుగా తెలుసుకోగలుగుతారని కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్ త్వరలో ఇతర బీటా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

మానవాళి ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లపై కొత్త స్టిక్కర్​ ప్యాక్​ను ఇప్పటికే విడుదల చేసింది వాట్సాప్.

ఇవీ చదవండి: వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంలో వ్యాజ్యం

పౌరుల గోప్యత ప్రభుత్వాల బాధ్యత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.