మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలను మరింత సులభతరం చేసింది. యూజర్లకు పేమెంట్ విషయంలో ఇబ్బందులు లేకుండా.. మెసేజ్ పేజీలోనే పేమెంట్ షార్ట్‌కట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ బీటా వెర్షన్‌ను పరిశీలించినట్లయితే.. మెసేజ్ బార్లో కెమెరా, అటాచ్మెంట్ షార్ట్‌కట్ ఐకాన్స్ మధ్య ఈ పేమెంట్ షార్ట్‌కట్ ఉంది. దీని ద్వారా ఛాటింగ్ పేజీ నుంచే.. సులభంగా పేమెంట్స్ కూడా చేయొచ్చు. వాట్సాప్ బీటా వర్షన్ 2.21.17 వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర సాధారణ వర్షన్లకు అందుబాటులోకి రానుంది. ఐఓఎస్ యూజర్లకూ ఈ ఈ షార్ట్‌కట్‌ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది.
పోటీకోసం ప్రయత్నాలు..
ప్రస్తుతం పేమెంట్ సేవల మార్కెట్లో భారీ యూజర్ బేస్ ఉన్న గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లకు పోటీనిచ్చేందుకు.. వాట్సాప్ ప్రయత్నిస్తోంది. అయితే ఆయా సంస్థలు క్యాష్‌బ్యాక్, కూపన్ ఆఫర్లతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. దీనితో ఆయా యాప్‌లకు పోటీ ఇవ్వాలంటే.. వాట్సాప్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అయితే అది అంత సులువేం కాదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆకర్షణీయంగా పేమెంట్ సేవలు..
ఇటీవలే పేమెంట్ సేవలను మరింత ఆకర్షణీయంగా మార్చింది వాట్సాప్. పేమెంట్‌కు బ్యాక్‌గ్రౌండ్ కూడా జత చేసే వెసులుబాటు కల్పించింది. డబ్బులు పంపే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ థీమ్ ద్వారా తమ భావాల్ని కూడా వ్యక్తపరిచే విధంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
వేడుక, ఆత్మీయత, ప్రేమ, సంతోషం.. ఇలా పలు రకాల భావాలను చెల్లింపులు చేసే సమయంలో యూజర్లు వ్యక్తపరిచే వెసులుబాటు కల్పించింది.
ఇదీ చదవండి: Whatsapp update : వాట్సాప్‌లోని ఆ ఫీచర్లలో మార్పులు!